నిఖిల్ కు చుక్కలు చూపించిన అర్జున్ సురవరం.. ఈ సినిమా టైటిల్ వెనుక‌ ఇంత రచ్చ నడిచిందిగా..!

Amruth kumar
కొత్త బంగారంలోకం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన నిఖిల్ సిద్ధార్థ్ .. తర్వాత హీరో గా వరుస‌ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే క్రేజీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు . ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియ  సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . అలాంటి నిఖిల్ కెరియర్ లో ఓ సినిమా టైటిల్ కారణంగా లేనిపోని వివాదాలు తెచ్చిపెట్టింది . ఇంత కీ ఆ సినిమా ఏమిటి .. ఆ టైటిల్ వివాదం ఏంటి అనేది ఇక్కడ చూద్దాం .

నిఖిల్ హీరోగా 2019 లో ఎన్ సంతోష్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అర్జున్ సురవరం విడుద‌లకు ముందు ఎన్నో వివాదాలకు కారణమైంది . ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ టైటిల్ దగ్గర్నుంచి ఈ సినిమా వివాదాలు కు కారణమైంది. ఇదే పేరుతో జగపతిబాబు హీరోగా మరో సినిమా రావటం ఈ వివాదాలకు కారణమైంది. ఆ స‌మ‌యం లో నిఖిల్ ‘ముద్ర’ పోస్టర్లు వాడుకుని బుకింగ్ యాప్‌ల లో ఆ చిత్రం టిక్కెట్లను విక్రయించడం వివాదాస్పదమైంది. తన పేరు, చిత్ర లోగో, పోస్టర్లను వాడుకుని ‘ముద్ర’ సినిమా టిక్కెట్లను అమ్ముకున్నారని నిఖిల్ అ స‌మ‌యంలో ఆరోపించారు .

అది తన సినిమా కాదని , తన ‘ముద్ర’ విడుదల కు ఇంకా సమయం ఉందని నిఖిల్ ప్రకటించారు . ఆ తరవాత జగపతిబాబు ‘ముద్ర’కు నిర్మాత అయిన నట్టికుమార్ .. నిఖిల్‌పై ఫైర్ అవ్వడం , క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం వంటి  ఎన్నో విష‌య‌లు అప్పుడు చోటు చేసుకున్నాయి . ఈ వివాదం కారణంగా తమ సినిమాకు నష్టం రాకూడదని భావించిన‌ నిఖిల్ .. అప్పుడు టైటిల్‌ను మార్చుకుంటున్నారు. వాస్తవానికి నిఖిల్ హీరోగా వచ్చిన‌ ‘ముద్ర’.. తమిళ చిత్రం ‘కనితన్’కి రీమేక్. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు అర్జున్ లెనిన్ సురవరంగా కనిపించనున్నారు. ఆ సినిమాలో హీరో పేరుగా ఉన్న అర్జున్ సర్వరాన్ని ఈ సినిమాకు టైటిల్ గా పెట్టి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచిగానే హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: