జూనియర్
ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఇక ఇప్పటివరకు ఈ
సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి 600 కోట్ల కలెక్షన్ల వైపు పయనిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా ఇప్పటికే విడుదల అయ్యి 4 వారాల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి కొంత కాలంలోనే ఈ
సినిమా 50 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ
మూవీ 50 రోజుల సెంటర్ల విషయంలో అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ
సినిమా ఏ ఏరియాలో 50 రోజుల్లో ఎన్ని థియేటర్లలో ఆడబోయే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం
హైదరాబాద్ సిటీ లో ఈ
మూవీ దాదాపు 60 థియేటర్లలో నడుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా పెద్ద సినిమాలు ఏమీ విడుదలకు రెడీ గా లేకపోవడంతో ఈ
సినిమా ఈజీగా
హైదరాబాద్ సిటీలో 30 నుండి 40 థియేటర్లలో 50 రోజుల వేడుకలు జరుపుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నైజాం ఏరియా మొత్తంలో కలిపి ఈ
సినిమా 90 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 150 కి పైగా థియేటర్లలో ఈ
మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డైరెక్ట్ గా 50 రోజులను 240 సెంటర్లలో జరుపుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే దేవర
సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకున్నట్లే అవుతుంది.