అందరి విషయంలో చాలా సాఫ్ట్ గా ఆలోచించే సురేఖ ..ఆ ఒక వ్యక్తి నే బూతులు తిడుతుంది ఎందుకు..?

Thota Jaya Madhuri
చిరంజీవి భార్య సురేఖ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్టార్ హీరో భార్య అని కాదు ..మంచి మనసు ఉన్న వ్యక్తి అని . తన ఇంటికి ఎవరు సహాయం కోసం వచ్చిన కాదు కూడదు అనకుండా తనకు మించిన స్థాయిలోనే హెల్ప్ చేస్తూ ఉంటుంది . మరి ముఖ్యంగా చిరంజీవితో వర్క్ చేస్తే టైం లో ఎవరైనా స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఇంటికి వస్తే వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టే పంపించేది . అంతేకాదు మొహమాటం లేకుండా వాళ్ళతో మాట పడకుండా వాళ్లకు అన్ని భోజనాలు తినమంటూ చాలా నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చేది .


ఈ విషయాన్ని స్వయంగానే ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . అంతే కాదు చిరంజీవి కంటే సురేఖకి ఫ్యాన్స్ ఎక్కువ అంటూ కూడా పలు సందర్భాలలో ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . చిరంజీవి ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా సురేఖ అని అంటూ చాలామంది చెప్పుకొచ్చారు . అంతే కాదు చిరంజీవి కూడా స్వయం ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు . సురేఖ కారణంగానే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు .


అలాంటి సురేఖ అన్ని విషయాలలో సైలెంట్ గా ఉన్న ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు ఫైర్ అయిపోతూ ఉంటుందట.  కొన్నిసార్లు బూతులు కూడా తిడుతూ ఉంటుందట . అది ఏంటో కాదు శ్రీజ పెళ్లి మ్యాటర్ . యస్ శ్రీజ పెళ్లి మేటర్ అందరికీ తెలిసిందే . మొదట ఇంట్లో వాళ్ళని కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది.  రెండు పెళ్ళిళ్ళు ఢమాల్ అంటూ ఫ్లాప్ అయిపోయాయి.


ఆమె కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది . అయితే సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. మరి ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న మూమెంట్లో అనవసరంగా శ్రీజను మధ్యలోకి లాకి ఆమె పేరుని గబ్బు పట్టించేశారు . ఆ టైంలో సురేఖకు చాలా కోపం వచ్చిందట.  తన కూతురు తప్పులేకుండానే ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా తప్పు తప్పుగా ఆమెను మాట్లాడుతున్నారు అంటూ చాలా బాధపడిందట . ట్రోల్ చేసే వాళ్ళని బాగా బూతులు కూడా తిట్టిందట.  ఏ తల్లి అయినా సరే కూతురు విషయంలో అలా మాట్లాడితే అంతే.   సురేఖ కూడా అంతే తన కూతురు విషయంలో అలాగే ఆలోచించింది అంటున్నారు మెగా ఫాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: