టాలీవుడ్ హీరోలకు బిగ్ రిలీఫ్.. వాయిదా పడిన ఆ తమిళ స్టార్ హీరో మూవీ..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది వంటే చాలు మన తెలుగు సినిమాలు ఎడ్డ ఎత్తున విడుదలకు రెడీగా ఉంటాయి. ఒక్కో సంక్రాంతి సీజన్ మి మూడు , నాలుగు సినిమాలు విడుదల అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా మన తెలుగు సినిమాలు ఎంత పెద్ద స్థాయిలో సంక్రాంతి పండుగకు విడుదలకు రెడీ అవుతుంటే ఈ మధ్య కాలంలో సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ తమిళ సినిమాలు కూడా తెలుగు బాక్సా ఫీస్ బరిలోకి దిగుతున్నాయి. వాటి వల్ల కాస్త కూస్తో తెలుగు సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది.

ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా , బాలయ్య , బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమా , సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న మజాకా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీలో విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలుపడ్డాయి. ఇకపోతే మైత్రి సంస్థ వారు తమిళ నటుడు అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితం ప్రకటించారు.

దీనితో మైత్రి సంస్థ వారు ఈ మూవీ తో ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీ కి పెద్ద ఎత్తున థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో వెళతాయి అని అంతా భావించారు. ఇకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి నుండి సమ్మర్ కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే తెలుగు సినిమాలకు పెద్ద స్థాయిలో సంక్రాంతి సీజన్లో ఊరట లభించినట్లే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: