ప్రేమ కావాలి తో బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే సందడి చేస్తున్న ఆది సాయికుమార్.. కొత్త సినిమాలు కంటే బెటర్..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ల సంఖ్య చాలా ఎక్కువ అయింది. దానికి ప్రధాన కారణం రీ రిలీజ్ అయిన సినిమాలలో చాలా సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తూ ఉండడంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఈ రీ రిలీస్ ల ట్రెండ్ ను బాగానే ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అనేక సినిమాలు రీ రిలీస్ అవుతూ మంచి కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇకపోతే ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలకు రీ రిలీజ్ లో భాగంగా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఆది సాయి కుమార్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ కావాలి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఆది సాయి కుమార్ , ఈషా చావ్లా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇకపోతే ఈ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. అలా మొదటి రిలీజ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అక్టోబర్ 26 వ తేదీన పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో విడుదల అయిన కొత్త సినిమాల కంటే కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను రీ రిలీస్ లో భాగంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆది సాయి కుమార్ కి ఈ మధ్య కాలంలో మంచి విజయాలు లేవు. ఆయన నటించిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడటం లేదు. ఆయనకు కూడా ఈ సినిమా రీ రిలీజ్ కాస్త పోరాటంలో కల్పించే అవకాశం ఉంది అని పలువురు జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: