బ్లాక్ బస్టర్ కావలసిన ఊసరవెల్లి కి అందుకే ఆ రిజల్ట్.. దర్శకుడు ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాలు అద్భుతమైన స్థాయిలో ఉండి ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టంచకుండా ముందుకు సాగిన కూడా కొన్ని సందర్భాలలో థియేటర్లలో కొన్ని సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందవు. ఆ తర్వాత ఆ సినిమాలు టీవీలలో వచ్చినప్పుడు మాత్రం సినిమాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటాయి. దానితో ఈ సినిమా అప్పుడు రావాల్సింది కాదు .. ఇప్పుడు రావాల్సింది కాదు అని అనేక కామెంట్స్ వాస్తు ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో కూడా ఒక సినిమా మొదటి నుండి స్టార్టింగ్ వరకు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది అదే ఊసరవెల్లి. కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తమన్నా హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.

ఇక ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే చాలా మంది ఈ సినిమా అద్భుతంగా ఉన్న కూడా మంచి కలక్షన్లను రాబట్ట లేకపోవడానికి ప్రధాన కారణం ఈ సినిమా కథ అని కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం కూడా ఎన్టీఆర్ సైడు నుండి కాకుండా హీరోయిన్ తమన్నా సైడ్ నుండి ఉంటుంది. తమన్నా కి హెల్ప్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుండి కష్టపడుతూ ఉంటాడు.

ఇక తమన్నా క్యారెక్టర్ కోసం హీరో అంతలా పరితపించడం , చాలా కష్టపడుతు ఉంటాడు. కానీ తన గురించి తాను ఏమి చేసుకోడు. అక్కడే ప్రేక్షకులు ఈ కథతో డిస్ కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమా బాగున్న జనాలు ఈ సినిమాను థియేటర్లలో విడుదల అయిన సమయంలో చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకొని ఊసరవెల్లి ఇప్పటికీ కూడా బుల్లి తెర ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: