తమిళనాడులో సత్తా చాటిన టాప్ 10 తెలుగు మూవీలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
తమిళనాడులో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 తెలుగు మూవీలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా తమిళనాడు లో 153 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తమిళనాడు ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 80 కోట్లతో 2 వ స్థానంలో నిలవగా ... రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా 75 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 45.2 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో నిలిచింది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ మూవీ 42 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ 30 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలిచింది. 

నాగార్జున , కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి సినిమా 27.2 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలో నిలవగా , మహేష్ బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్పైడర్ సినిమా 25 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ 24.6 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో నిలవగా ... రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ఈగ సినిమా 24.5 కోట్ల కలెక్షన్లతో 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: