దేవర పార్ట్ 2: అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్న ట్విస్టులు!

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో దేవర కూడా ఒకటి. ఎన్టీఆర్ నటన, కొరటాల శివ దర్శకత్వం, సంగీతం, కథ ఇలా ప్రతి అంశం కూడా ప్రేక్షకులను అలరించింది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. దేవర పార్ట్ 1 విడుదలైన తర్వాత ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ గా సీక్వెల్ ను కన్ఫార్మ్ చేశారు. 

అంతేకాకుండా పార్ట్ 2లో చాలా ఆసక్తికర ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దేవర పార్ట్ 2 గురించి ఎన్నో రకాల రూమర్లు వస్తున్నాయి. కొందరు ఎన్టీఆర్ రెండు పాత్రలు చేయబోతున్నాడని, మరికొందరు కథలో మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. అయితే ఈ రూమర్ల లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది అదేంటంటే. పార్ట్ 2 లో వర తో పాటుగా దేవర కూడా కనిపించొచ్చు అని తెలుస్తుంది. అంతేకాకుండా క్లైమాక్స్ లో దేవర కచ్చితంగా చనిపోయినట్టు కూడా క్లారిటీ ఇవ్వలేదు అని సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులు చెప్పుకొచ్చారు.

ఇకపోతే దేవర పార్ట్ 2లో ఇద్దరే ఉండాలని ఏం లేదు ముగ్గురు కూడా ఉండొచ్చు ఏమో అంటూ దేవర కి వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్ కామెంట్స్ చేశాడు. ఇక తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం దేవర పార్ట్ 1 విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినా అభిమానులంతా కచ్చితంగా పార్ట్ 2 లో ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: