జానీ మాస్టర్ తరువాత నెక్స్ట్ జైలుకి వెళ్లబోయేది అతనేనా..? తెరపైకి మరో స్టార్ పర్సన్..!

Thota Jaya Madhuri
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిందే. ఒక నెలరోజుల ముందు వరకు జానీ మాస్టర్ అంటే తోపైనా కొరియోగ్రాఫర్. ఆయన స్టెప్స్ కంపోజ్ చేస్తే వేలు పెట్టే వాళ్లే ఉండరు . ఆయన డాన్స్ కొరియోగ్రఫీ చేస్తే ఆ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . కేవలం టాలీవుడ్ -కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జానీ మాస్టర్ వేసిన స్టెప్ మళ్ళీ వేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ తో అలరించడమే కాకుండా స్టార్ హీరోస్ కి కూడా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు .


పెద్ద పెద్ద బడా హీరోలు కూడా తమ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా జానీనే కావాలి అంటూ పట్టు బట్టి ఆయనని స్టెప్స్ కంపోజ్ చేసేలా చేసుకున్న  స్టార్ట్ హీరోలు కూడా ఉన్నారు. అయితే ఆయన టైం బ్యాడ్ ఊహించని చిక్కుల్లో ఇరుకున్నారు. తన అసిస్టెంట్ అయిన లేడీ డాన్సర్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడు . ఆమెను బలవంతం చేశాడు . ఆమె పట్ల దారుణంగా బిహేవ్ చేశాడు అంటూ ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన ఏకంగా జైలుకు కూడా వెళ్ళాడు.  రీసెంట్ గానే బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ వస్తున్నారు. అంతేకాదు జైలు జీవితం ఏ మనిషి కూడా గడపకూడదు అని ..అది చాలా చాలా టార్చర్ అని చెప్పుకొచ్చారు.


ఇలాంటి క్రమంలోనే జానీ మాస్టర్ బయటికి రావడంతో నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి వెళ్ళబోయేది మరొక స్టార్ యూట్యూబర్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అవకాశాల పేరుతో చాలా మంది అమ్మాయిలను వాడుకుని వదిలేస్తున్నారు స్టార్ట్ పొజిషన్లో ఉండే వ్యక్తులు . మరి ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి స్టార్స్ అయిపోయాక బుల్లితెర పై అలాగే వెండితెరపై అవకాశాలు దక్కించుకొని ..మేమే తోపు మేమే తురుము అన్న రేంజ్ లో హంగామా చేస్తున్నారు .


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఒక యూట్యూబర్ కూడా అమ్మాయిల పట్ల అలాగే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు త్వరలోనే అతను కూడా జైలుకు వెళ్ళబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా పైకి మంచివాడిలా కనిపించే ఈ యూట్యూబర్ లో లోపల స్టార్ అన్న మూసుకుతో చాలా చెడ్డ పనులు కూడా చేస్తున్నాడు అని దేవుడు అన్ని చూస్తున్నాడు అని.. టైం వస్తే జానీ మాస్టర్ జైలు లో గడిపిన జీవితాన్ని కూడా అనుభవిస్తాడు అని జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: