ఒక్క హిట్‌ కోసం ఒక్కొక్కరిది ఒక్కో సమస్య ... ఇంతకీ ఈ భామల కథ ఏంటంటే..!

Amruth kumar
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత గట్టిగానే కనిపిస్తుంది. సక్సెస్ ఉన్న హీరోయిన్లకు ప్రస్తుతం అసలు ఖాళీ లేదు. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు దొరకటం లేదు. ఆరు సంవత్సరాలుగా ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉంది శ్రీలీల .. కానీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని ఎదురుచూస్తున్నారు. రవితేజతో ఓ సినిమా ఓకే చేసిన అది షూటింగ్ నెమ్మదిగా వెళుతుంది. రీసెంట్గా రవితేజకు సర్జరీ  కావడంతో దానికి తగ్గట్టుగానే షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు . ఇక వీటితో పాటు ఉస్తాద్,రాబిన్ హుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తుంది.

ఇక మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా కం బ్యాక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. విజయ్ దేవరకొండ ఖుషి యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో తెలుగులో చాలా కాలంగా సమంతకు సరైన హిట్ లేదు . పైగా ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ వెబ్  సిరీస్ లు చేస్తూ వెళ్తుంది . ఈమధ్య కోలీవుడ్ లోనూ ఓ సినిమాలో సైన్ చేసినట్టు తెలుస్తుంది. మరో హీరోయిన్ రరష్మిక మందన్నకు విజయాలు ఉన్నా కానీ ప్రేక్షకులలో ఆమెకు గ్యాప్ వచ్చేసింది. ఇక ఆ మధ్య ఓ ఆక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులు రెస్ట్ మోడ్ లో ఉన్నారు రష్మిక.. ఇప్పుడు పుష్ప 2 తో మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు .

మరోవైపు మరో యంగ్ బ్యూటీ కృతి శెట్టి సైతం ఒక్క విజ‌యం కోసం ఎంతో ఎదురు చూస్తుంది. వ‌రుస‌ డిజాస్టర్స్ మధ్య ఈమె తన కెరియర్ మార్చే సినిమా కోసం ప్రయత్నాలు చేస్తుంది బేబమ్మ. అలాగే మరో సీనియర్ హీరోయిన్ త్రిష సైతం చిరంజీవి విశ్వంభరతో తన మార్కు చూపించాలని ఆశపడుతుంది. మిస్టర్ బచ్చన్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం ఓ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు.. దుల్కర్ సల్మాన్ కాంతాలోనూ నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. వీటితోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇలా ఈ హీరోయిన్లు ఒక్క హిట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరి హీరోయిన్ల కళ నెరవేరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: