లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్: అసలు స్పెషల్ గెస్ట్ ఎవరు..?

Anilkumar
తెలుగు సినీ ప్రేక్షకులకు దీపావళి కానుకగా వస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళ మేనరిజం నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నరు దుల్కర్ సల్మాన్. కాగా  సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు వివేక్ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇందులో నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తర్వాత ఈ చిత్రం పై ప్రేక్షకులకు మరింత  భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 27 న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ ఈవెంట్ కి ఎలాగైనా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని తెలిసిందే ఇక ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మేకర్స్ ఇప్పుడు తన పేరుతో పాటుగా మరో స్పెషల్ గెస్ట్ పేరును కూడా అనౌన్స్ చేశారు. విక్రమ్ తో పాటుగా సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నట్లుగా రివీల్  చేశారు మేకర్స్. దీంతో ఈవెంట్ మరింత క్రేజీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా జరగబోతుంది అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్,గా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

ఈ అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కోసం సల్మాన్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌ లో విజయం సాధిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ తన నటనతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. వెంకీ అట్లూరి కూడా వినోదాత్మక చిత్రాలను తీయడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చే చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: