ఆగడు, వన్ నేనొక్కడినే వంటి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబుకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది..సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు..ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన మహేష్ శ్రీమంతుడు సినిమా దగ్గరి నుంచి ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మూవీలు ప్రేక్షకాధారణ పొందుతూ మంచి విజయం సాధిస్తున్నాయి ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను సినిమా ఒకటి.. శ్రీమంతుడు తరువాత కొరటాల దర్శకత్వంలో మహేష్ నటించిన రెండో సినిమా ఇదే కావడం విశేషం..ఇందులో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని డైలాగ్ తో మహేష్ మొదలు పెడతాడు. అయితే దాన్నే సినిమా టైటిల్‌గా దర్శకుడు కొరటాల ఉంచారు.
ఈ డైలాగ్ సినిమా రిలీజ్‌కు ముందే ఎంతో పాపులర్ అయింది.. అప్పట్లో సినిమాకు హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా బాగా ఉపయోగపడింది.సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు..అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేశ్ చేసే ప్రతిజ్ఞ హైలైట్ గా నిలుస్తుంది..భరత్ అనే నేను.. అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది. ఆ డైలాగ్ చెప్పడానికి మహేశ్ ఏకంగా 2 గంటలు పైనే సమయం తీసుకున్నాడట.. సాధారణంగా నేతలు ప్రమాణం చేసినప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. ఇది సినిమా కనుక ఎలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్‌తో చెప్పాలి..లేదంటే చాలా పేలవంగా ఉంటుంది. అందుకనే చాలా టైం తీసుకుని మరీ ఆ డైలాగ్‌ను స్పష్టంగా చెప్పానని మహేష్ తెలిపారు.. ఆ తరువాత ఆ డైలాగ్ విన్నాక ఎంతో గొప్పగా ఫీలయ్యానని మహేష్ అప్పట్లో అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..