టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
శివ నిర్వాణ ఒకరు. ఈయన నాచురల్ స్టార్
నాని హీరోగా
నివేదా థామస్ హీరోయిన్గా రూపొందిన
నిన్ను కోరి అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ
సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను
శివ నిర్వాణకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా మొదటి మూవీతోనే ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ఈ దర్శకుడు తన కెరియర్లో రెండవ సినిమాగా
నాగ చైతన్య హీరోగా
సమంత హీరోయిన్గా
మజిలీ అనే మరో
ప్రేమ కథ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.
ఈ
సినిమా కూడా అద్భుతంగా ఉండడంతో భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను రూపొందించిన విధానానికి కూడా ఈయనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక
ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా
వెండి తెరపై తెరకెక్కించడంలో ఈయన స్పెషలిస్ట్ అనే పేరును కూడా తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు. అంతా గొప్ప పేరును తక్కువ టైమ్ లోనే సంపాదించుకున్న ఈయన ఈ మధ్యకాలంలో మాత్రం వరుస అపజాగాలను అందుకుంటున్నాడు. కొంత కాలం క్రితం
నాని హీరోగా ఈయన
టక్ జగదీష్ అనే సినిమాను రూపొందించాడు. ఈ
మూవీ థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ దక్కలేదు.
ఇక కొంత కాలం క్రితం ఈ దర్శకుడు విజయ్
దేవరకొండ హీరోగా
సమంత హీరోయిన్గా
ఖుషి అనే మూవీని రూపొందించాడు. ఈ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఖుషి మూవీ విడుదల ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈయన తదుపరి మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇలా మొదటి రెండు మూవీలలో
బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈ దర్శకుడు తర్వాత మాత్రం రెండు అపజయాలను అందుకున్నాడు.