సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా కెరియర్లు మొదలు పెట్టిన కొత్తలో అద్భుతమైన విజయాలను అందుకొని ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న కొంత మంది దర్శకులు ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో వెనుకబడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఒకరు. ఈయన సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా రూపొందిన బొమ్మరిల్లు మూవీతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చింది.
దానితో తన నెక్స్ట్ మూవీని అల్లు అర్జున్ తో చేశాడు. భాస్కర్ "బొమ్మరిల్లు" మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా పరుగు అనే టైటిల్ తో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా బొమ్మరిల్లు స్థాయి విజయాన్ని అందుకోకపోయినా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఆ తర్వాత మగధీర లాంటి బ్లాక్బస్టర్ విజయం అందుకొని ఫుల్ జోష్లో ఉన్న రామ్ చరణ్ హీరోగా ఆరంజ్ అనే మూవీని భాస్కర్ రూపొందించాడు. ఈ మూవీ మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమాతో భాస్కర్ కెరియర్ కూడా డైలమాలో పడిపోయింది.
ఆ తర్వాత ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అవి పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. ఆఖరుగా ఈ దర్శకుడు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కానీ మరి భాస్కర్ కి అదిరిపోయే రేంజ్ కమ్ బ్యాక్ ఇచ్చే స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. కెరియర్ బిగినింగ్లో సూపర్ సాలిడ్ విజయాలను అందుకున్న భాస్కర్ ఈ మధ్య కాలంలో ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు.