విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ... వెంకటేష్ కి జోడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సంక్రాంతి కి వస్తున్నాం అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న వెంకటేష్ కంటే ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి ఎక్కువ పారితోషకాన్ని తీసుకుంటున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న వెంకటేష్ కి 18 కోట్ల పారితోషకాన్ని ఇస్తే , ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి కి 25 కోట్ల పారితోషకాన్ని ఇస్తున్నట్లు ఓ వార్త ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతుంది.
ఇక పారితోషకంతో పాటు ఈ మూవీ లో హీరో గా నటిస్తున్న వెంకటేష్ కు , దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి కి ఈ మూవీ లాభాల్లో వాటాలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దానితో విక్టరీ వెంకటేష్ పారితోషకం ఈ సినిమాకు 22 నుండి 23 కోట్ల వరకు ఉండనున్నట్లు , అనిల్ రావిపూడి కి ఈ సినిమా ద్వారా 30 కోట్ల వరకు పారితోషకం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.