ప్రేమ కావాలి : ఇదెక్కడి మస్ రెస్పాన్స్.. థియేటర్స్ ఆడ్ చేయాల్సిందేనా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం ఆది సాయి కుమార్ హీరోగా ఇషా చావ్లా హీరోయిన్ గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రేమ కావాలి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే ఆది సాయి కుమార్ , ఈషా చావ్లా వెండి తెరకు పరిచయం అయ్యారు. మంచి అంచనాల నడుమ ధియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఆది సాయి కుమార్ , ఈషా చావ్లా కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఆది సాయి కుమార్ నటించిన లవ్లీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాల్లో నటించిన ఏ మూవీ ద్వారా ఈ నటుడుకి సరైన విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇక ఇషా చావ్లా కూడా ప్రేమ కావాలి సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఈమెకు కూడా ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల ద్వారా మంచి విజయాలు దక్కాయి. కానీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలు దక్కలేదు. దానితో ఈమె క్రేజ్ కూడా చాలా తక్కువ కాలంలోనే తగ్గిపోయింది. ఇకపోతే ఈ రోజు అనగా అక్టోబర్ 26 వ తేదీన ప్రేమ కావాలి మూవీ ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రీ రిలీజ్ కి కేటాయించిన షో లు అన్ని హౌస్ పూల్స్ కావడంతో కొత్త షో లను ఆడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అవి కూడా ఫుల్ అయితే మరిన్ని షో లను కూడా ఆడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రేమ కావాలి సినిమా రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: