రాజమౌళికి నచ్చిన మహేష్ సినిమాలు ఆ రెండే.. అసలు కారణం ఇదే...?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు 28 చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. యుక్త వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాజకుమారుడు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ప్రిన్స్ హీరో గా పేరు సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే మహేష్ బాబు ఎనర్జీ , యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు రాజకుమారుడు చిత్రంలోని సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక మురారి, ఒక్కడు, పోకిరి , అతడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ , ఇండస్ట్రీ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయని చెప్పవచ్చు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా చలామణి అవుతున్న ఈయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈయన సినిమాలను ఇష్టపడతారు. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చివరిగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు.  ఇది ఒక అరుదైన కాంబినేషన్ అనే చెప్పాలి.  ఎందుకంటే ఇంతవరకు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాలేదు.  అంతేకాదు కనీసం ఒక యాడ్ కోసం కూడా వీళ్ళిద్దరూ కలిసి పనిచేయలేదు.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 అనే టైటిల్ తో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు నటించిన 28 చిత్రాలలో రాజమౌళికి నచ్చింది రెండే సినిమాలట. అందులో ఒకటి పోకిరి,  ఇంకొకటి ఒక్కడు. ఈ రెండు చిత్రాలంటే కూడా రాజమౌళికి చాలా ఇష్టమట.  ఈ రెండు చిత్రాలలో కూడా మహేష్ బాబు సరికొత్తగా ఉండడమే కాకుండా తన నటన అద్భుతంగా ఉందని ఈ కారణాల వల్లే ఈ రెండు తనకు చాలా ఇష్టమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: