వేల కోట్ల ఆస్తి ఉన్న బాలయ్యకు ఆ కోరిక ఇప్పటికీ నెరవేరలేదు.. ఆ దేవుడికి కూడా కనికరం లేదే..!
బాలయ్యకు మొదటి నుంచి ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టమట . తన ఇంట్లో ఒక పాప అయినా ఉంటే బాగుంటుంది అంటూ చాలా ఆశపడ్డారట. ఆ కోరికను దేవుడు బాగా ఆలకించి ఇద్దరు కూతుర్లను ఇచ్చారు . అయితే ఈ వయసులో బాలయ్య మనవరాళ్లతో ఆడుకోవాలని ఆశపడుతున్నారట . మనకు తెలిసిందే బాలయ్య ఇద్దరు కూతుర్లు బ్రాహ్మీణికి - తేజస్వినికి ఇద్దరికీ కూడా కొడుకులు . కానీ బాలయ్యకు ఒక చిన్ని పాప ఉంటే బాగుంటుంది.. ఇంటికి మహాలక్ష్మి కల వస్తుంది అంటూ చాలా సార్లు ఆశపడ్డారట .
కానీ ఆ కోరిక నెరవేరలేదు . ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా..? అంటూ బాలయ్య వెయిట్ చేస్తున్నారు . కొన్ని కొన్ని సార్లు ఎవరైనా ఆడపిల్లల్ని ఎత్తుకొని ఉన్నప్పుడు బాలయ్యకు తనకు మనవరాలు లేరే అన్న విషయం గుర్తొస్తుందట. చాలా చాలా బాధపడతారట. నందమూరి బాలయ్య భార్య వసుంధర కి కూడా ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టం . కొడుకు విషయంలో నైనా ఆ కోరిక నెరవేరుతుందేమో అనుకుంటే..అది ఇప్పుడల్లా జరగని పని. నందమూరి మోక్షజ్ఞకు ఇప్పుడే పెళ్లి చేయరు . అది జరగాలంటే ఒక 10 ఏళ్ల పైమాటే అంటూ మిగతా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!