పరశురాం: డైరెక్షన్ దారి మరచిన దర్శకులు.. పరశురాముడు యుద్ధం ఆపాడా.?

Pandrala Sravanthi
- గీత గోవిందంతో మెరుపు మెరిశాడు..
- సర్కారు వారి పాటతో సాటి లేదనిపించాడు..
- ఫ్యామిలీ స్టార్ తో చల్లబడిపోయాడు..

 
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. ఈ సామెత సినిమా ఇండస్ట్రీ వారికి బాగా సెట్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్డం ఉంటుందో అప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కొందరు ఆ తర్వాత కనిపించకుండా పోతారు. అది నటీనటుల విషయంలో కానీ దర్శకనిర్మాతల విషయాల్లో కానీ ఇదే జరుగుతుంది. ఆ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలకు సూపర్ హిట్ అందించినటువంటి ఈ దర్శకులు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వారి మార్క్ చూపించడం లేదు. కనీసం వారి నుంచి సినిమాలు కూడా రావడం లేదు. ఒకవేళ సినిమాలు వచ్చినా అవి దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒకప్పుడు హీరోల కెరియర్ ను నిలబెట్టే సినిమాలు ఇచ్చిన వీరు ఎందుకు ఇలా వెనకబడి పోతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ పరశురాం. ఒకప్పుడు హీరోలకు లైఫ్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో వెనుకబడి పోయాడు. ఈయనకి ఏమైంది? ఆ వివరాలు ఏంటో చూద్దాం.?
 పరశురాంకు  ఏమైంది?
 యువత అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పరుశురాం ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి  ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలున్నాయి. ఇక పరశురాం కు భారీ హిట్ ఇచ్చినటువంటి చిత్రాల్లో గీతాగోవిందం, సర్కారు వారి పాట ఉంటాయి. ఇక ఇవే కాకుండా సారొచ్చారు,  ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు కూడా చేశారు.  ఇక ఈ సినిమాల్లో గీతగోవిందం, సర్కారి వారి పాట ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. విజయ్ దేవరకొండ కెరియర్ నే మార్చింది గీతాగోవిందం. ఈ విధంగా పరశురాం అద్భుతమైన చిత్రాలు అందించి చివరికి విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరం అయిపోయారు.  ఈ ఈ మధ్యకాలంలో ఈయన నుంచి ఎలాంటి సినిమాలు కూడా రావట్లేదు. ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరుపొందిన పరశురాం  తెలుగు ఇండస్ట్రీలో ఇలా వెనుకబడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా పరుశురాం ఇతర ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఆయన మళ్లీ తెలుగులో చేస్తారా లేదంటే ఇతర ఇండస్ట్రీలో పై దృష్టి పెట్టి అక్కడే సెట్ అవుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: