సురేందర్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు..'అతనొక్కడే'గా మొదలుపెట్టి ఏజెంట్ తో ఎండ్.!
- సైరా నరసింహారెడ్డి తో సాటిలేదు అనిపించుకున్నాడు..
- ఫేమస్ దర్శకుడు ప్రజెంట్ ఆగాడేందుకో?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ దర్శకుల్లో సురేందర్ రెడ్డి కూడా ఒకరు. మాస్ కామెడీ చిత్రాలు తీయడంలో ఈయన దిట్ట. అలాంటి సురేందర్ రెడ్డి ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. తాను ఎదుగుతూ హీరోలను కూడా ఎదిగేలా చేసిన గొప్ప దర్శకుడు అని చెప్పవచ్చు. అలాంటి సురేందర్ రెడ్డి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీకి అందించి చివరికి ఆగిపోయాడు.. అతనొక్కడే అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఏజెంట్ సినిమాతో ఎండ్ కార్డు పెట్టాడు. మరి సురేందర్ రెడ్డి ఎవరికి ఎలాంటి హిట్ ఇచ్చాడు. ఆయన ఇండస్ట్రీలో ఆగిపోవడానికి కారణాలు ఏంటి అని వివరాలు చూద్దాం.
సురేందర్ రెడ్డి ఏమయ్యాడు?
కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తర్వాత రవితేజ తో కిక్ సినిమా చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అలాగే అల్లు అర్జున్ తో రేసుగుర్రం చేసి రేసు గుర్రంలా ఇండస్ట్రీలో పరిగెత్తాడు. ఆ తర్వాత ధ్రువ,సైరా నరసింహారెడ్డి వంటి అద్భుతమైన హిట్లందుకొని తనకిక సాటి లేదు అనిపించుకున్నారు.ఇక చివరిగా అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా చేసి బోల్తాపడ్డాడు. ఇక అప్పటినుంచి సురేందర్ రెడ్డి ఎలాంటి సినిమా అప్డేట్ అనేది కనిపించడం లేదు. అలా ఎంతోమంది హీరోలకు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన సురేందర్ రెడ్డి అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆయన ఏమయ్యారని చాలా మంది ఆరా తీస్తున్నారు. మరి చూడాలి సురేందర్ రెడ్డి మళ్ళీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారా లేదంటే సైలెంట్ గా ఉండిపోతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.