ఆ హీరోయిన్ ని సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా.. నిజంగానే సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ కాదా. హనీమూన్ కి కూడా వెళ్లారా.. ఇంతకీ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు. ఈయన డేటింగ్ లిస్టులో చాలామంది హీరోయిన్ల పేర్లు ఉంటాయి. కానీ వీరందరిలో ఎక్కువ వైరల్ అయింది మాత్రం ఐశ్వర్యరాయ్.. సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ ఇద్దరు వివాహం చేసుకోవాలి అనుకున్నారు. కానీ సల్మాన్ ఖాన్ పెట్టే టార్చర్ భరించలేక ఐశ్వర్య ఆయనకు బ్రేకప్ చెప్పి ఆయన వలలో నుండి బయటపడింది.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ పెట్టే చిత్రహింసల గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.ఆయన దారుణంగా కొట్టేవాడని, తాగచ్చి టార్చర్ చేశాడు. మానసికంగా శారీరకంగా హింసించాడు.
అందుకే ఆయన నుండి తప్పించుకున్నాను అంటూ ఐశ్వర్య రాయ్ చెప్పింది.అయితే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లు బ్రేకప్ చెప్పుకోకముందు ఐశ్వర్య సల్మాన్ ఖాన్ ను రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ఒక రూమర్ బీటౌన్ లో చక్కర్లు కొట్టింది. ఎంతలా అంటే అందరూ నిజమే అని నమ్మేలా జాతీయ మీడియా ఛానల్స్ కూడా ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు రాశారు. అయితే వీరిద్దరి పెళ్లి లోనవాలా లో రహస్యంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్యన జరిగిందని, పెళ్ళయ్యాక న్యూయార్క్ కి హనీమూన్ కి కూడా వెళ్లారంటూ ఒక ప్రచారం తెరమీద వినిపించింది. అయితే ఈ రూమర్ పై సల్మాన్ ఖాన్ స్పందించలేదు.
కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం వెంటనే స్పందించింది. నేను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే ఈ పెళ్లి విషయాని దాచాల్సిన అవసరం నాకు లేదు.ఒకవేళ పెళ్లి జరిగితే ఈ విషయం మీకు చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక రీసెంట్ గా భర్తతో ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతుంది అని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అంబానీ కొడుకు పెళ్లిలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ ఇద్దరూ కలిసి ఫోటో దిగినట్టు ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక ఈ ఒక్క ఫోటోతో ఐశ్వర్య రాయ్ భర్తకు విడాకులు ఇచ్చేసి మాజీ ప్రియుడితో రెండో పెళ్లికి రెడీ అయింది అని పుకార్లు కూడా పుట్టాయి కానీ ఇందులో ఏది నిజం కాలేదు