అనసూయకు హగ్‌ ఇచ్చి..నలిపేసిన యూట్యూబర్‌?

Veldandi Saikiran
అనసూయ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 20 ఏళ్ల కిందట వచ్చిన ఎన్టీఆర్ హీరోగా చేసిన నాగ సినిమా సమయంలోనే ఈ బ్యూటీ స్క్రీన్ పై కనిపించింది. అనంతరం యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.  సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

ఇక ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కు వీడ్కోలు పలికి పూర్తిగా సినిమాలకే పరిమితమైన అనసూయ ఈ మధ్యకాలంలో మళ్లీ కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లడం వంటి వాటిలో అనసూయ చాలా చురుగ్గా పాల్గొంటారు.

ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ పాత్ర ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా....ప్రస్తుతం అనసూయకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అనసూయకు ఓ ప్రముఖ యూట్యూబర్ హాగ్ ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఈ వీడియోలో అనసూయ కారు నుంచి దిగిన వెంటనే నిఖిల్ అనే యూట్యూబర్ అనసూయకు హాగ్ ఇచ్చాడు. ఆ వెంటనే వీరిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. దీంతో ఈ వీడియో చూసిన కొంతమంది హాగ్ ఇవ్వడం అవసరమా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అంటూ కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: