రామ్ చరణ్ కి అలాంటి సర్జరి చేయించుకోమని సజెషన్ ఇచ్చిన ఆ పుణ్యాత్ముడు ఎవరో తెలుసా..?
అ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవచ్చు. అలా దక్కించుకున్న స్టార్స్ కూడా చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ . మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయన ఆ తర్వాత ఎలాంటి మంచి మంచి సినిమాల్లో నటించాడో మనకు తెలుసు . ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని రాంచరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే జనాలు చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు .
కాగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న టైంలో చాలామంది డైరెక్టర్ లు ఆయన డెబ్యూ కోసం వెయిట్ చేశారు. ఇంట్రెస్ట్ చూపించారు . అయితే ఆ అవకాశాన్ని పూరి జగన్నాథ్ కే ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా పూరి జగన్నాథ్ కన్నా ముందు ఒక బడా డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించాలి అనుకున్నారట . చిరంజీవితో సినిమాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ డైరెక్టర్ . అయితే ఈ డైరెక్టర్ రామ్ చరణ్ ముక్కు సరిగ్గా లేదు అని ..ఆ ముక్కు వల్ల ఆయన అందమే మారిపోతుంది అని ..ఆ ముక్కు సర్జరీ చేయించుకుంటే రామ్ చరణ్ లుక్స్ హ్యాండ్సమ్ గా తయారవుతాయి అని ..తద్వారా రామ్ చరణ్ కి కూడా మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అంటూ సజెస్ట్ చేసారట .
అయితే రామ్ చరణ్ తల్లి మాత్రం అందుకు ఒప్పుకోలేదట . బిడ్డ లక్షణంగా ఉన్నాడు దేవుడు ఇచ్చిన అందం ఇది ..ఎందుకు సర్జరీ చేయించుకోవాలి . అలా సర్జరీ చేయించుకో వద్దు అంటూ రాంచరణ్ కి తెగేసి చెప్పిందట . అంతే కాదు చిరంజీవి కూడా రామ్ చరణ్ సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు . ఆ కారణంగా ఆ డైరెక్టర్ ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్స్ ట్రై చేసినా ఫైనల్లీ పూరి జగన్నాథ్ కి రాంచరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వచ్చింది . చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ . ఆ తర్వాత ఆయన రేంజ్ నే మారిపోయింది..!