తెలుగు సినీ పరిశ్రమలో వాణిశ్రీ గారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ మహానటి తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాలలో కూడా నటించింది. రక్తకన్నీరు నాటకంలో కథానాయకుడి భార్య గాను చిల్లర కొట్టు చిట్టెమ్మ గా నటించి అభిమానుల మనసును దోచుకుంది. ఇకపోతే చిట్టెమ్మ గా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు వీర సంకల్పంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ గుర్తింపును తెచ్చుకుంది. తర్వాత రామచిలక అనే సినిమాలో తన నటనతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. రామచిలక సినిమా 1978లో విడుదలైన ఒక క్లాసిక్ తెలుగు చిత్రం. ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర అని చెప్పాలి. తన అద్భుతమైన అభినయంతో ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా చేశారు. ఆమె పాత్రలోని భావోద్వేగాలు, సంక్లిష్టతలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా మొత్తంలో తనే కనిపిస్తుంది. గ్రామంలో మంత్రసానిగా, ఎప్పుడు కిలకిల నవ్వుతూ జీవించే పాత్రలో తను నటించింది. కాగా ఆ గ్రామంలో టీచర్ గా వచ్చిన రంగనాథ్ ఈ అమ్మడు మనసును దోచుకుంటాడు. ఇక ఆ టీచర్ ఆ ఊరు మునసబు అమ్మాయితో జతకట్టడంతో ప్రేమికురాలు అయినా వాణిశ్రీ ఆ టీచర్ ని రక్షించే క్రమంలో తాను చనిపోతుంది. కాని వాణిశ్రీ అలా చనిపోవడం ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే రామచిలుక సినిమా తమిళంలో కమర్షియల్ గా సక్సెస్ అయినా కూడా ఇది ఒక రీమేక్ సినిమా. ఇకపోతే తమిళంలో ఈ సినిమా పాత్రలో వాణిశ్రీ పాత్రను సుజాత అలాగే రంగనాథ్ పాత్రను శివకుమార్ పోషించారు.
తమిళంలో సుజాత చనిపోవడం అలాగే తెలుగులో వాణిశ్రీ చనిపోవడం ఒకటి కాదు కదా... వాణిశ్రీ పాత్రను బ్రతికించి ఆ ప్రమాదంలో జయలక్ష్మి పాత్రను చంపి ఉంటే సినిమా ఇంకా భారీ సక్సెస్ అయి ఉండేదేమో అని అభిమానులు భావించి ఉండొచ్చు. ఇక ఈ సినిమాలోని పాటలన్నీ మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే రామచిలుక పెళ్ళికొడుకు ఎవడే అనే పాట ప్రేక్షకులను భారీగా మెప్పించింది. దర్శకుడు తెరకెక్కించిన తీరు నటీనటులు అందరూ చాలా బాగా నటించినప్పటికీ కూడా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇకపోతే ఇందులో వాణిశ్రీ, రంగనాథ్, చంద్రమోహన్, రావు గోపాలరావు, సాక్షి రంగారావు, ఫటాఫట్ జయలక్ష్మి, రాధాకుమారి, కాంతారావు, రవి కొండలరావు, మణిమాల ప్రధాన పాత్రలో నటించారు.