త్రిబుల్ ఆర్ రేంజ్ లో హిట్ అవ్వాల్సిన బాలయ్య మూవీ.. డిజాస్టర్ గా మిగలడానికి కారణం ఇదే..?
బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి మూవీ హిట్ అయిన తర్వాత సుల్తాన్ వంటి భారీ ప్రాజెక్టును మొదలు పెట్టాడు. కృష్ణ , కృష్ణంరాజు ఇదురు కూడా బిజీగా ఉన్నారు. వారీ డేట్స్ ని అడ్జస్ట్ అవుతూ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు .. సుల్తాన్ కోసం ముందుగా దర్శకుడు శరత్ అనుకున్న కథ ఒకటి కానీ కృష్ణ , కృష్ణంరాజు వంటి పెద్ద స్టార్లు ఈ ప్రాజెక్టులో కలిశాక కథలో పలు మార్పులు చేశారు . ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. విలన్ గా కూడా బాలకృష్ణ నటించరు.. అలాగే ఈ సినిమాలు ఏకంగా 11 గెటప్స్ లో ఆయన కనిపిస్తారు .
ఈ మూవీ షూటింగ్ అండమాన్ దీవుల్లో జరిగింది . బాలకృష్ణ, కృష్ణ , కృష్ణంరాజు స్పాట్ కి తమ ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లేవారట . అక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించారట. రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ లో ఈ టీం బస చేసింది.. అక్కడ తినడానికి తిండి సరిగ్గా దొరికేది కాదట.. చిత్ర యూనిట్ బియ్యం కూరగాయలు తెప్పిస్తే విజయనిర్మల , శామల దేవి అక్కడ వారికి వంట చేసేవారట. అలా సమరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాతో పోలిస్తే అభిమానులు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు కానీ ఇది అప్పట్లో గొప్ప ప్రయత్నం గా మిగిలిపోయింది.