తారక్ రెగ్యులర్ గా వాడే ఊత పదం ఇదే.. ఎవరు అలవాటు చేశారంటే..!?

Thota Jaya Madhuri
చాలామందికి మనలో ఒక అలవాటు ఉంటుంది . అవసరం ఉన్న అవసరం లేకపోయినా రెగ్యులర్ గా ఒక పదాన్ని పదే పదే వాడుతూ ఉంటారు. దానినే అందరూ ఊత పదం అంటూ ఉంటారు.  అయితే కేవలం సామాన్య జనాలే కాదు పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ కూడా కొన్ని కొన్ని పదాలను పదేపదే వాడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ - తారక్ - ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా కొన్ని ఊతపదాలను అదేవిధంగా వాడుతూ ఉంటారు .దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.


పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకున్న తారక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అరెరె మన తారక్ కి ఈ పదం అంత ఇష్టమా..?  దాన్నే ఊతపదంగా వాడుతున్నాడా ..? అంటూ ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు . నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ .. రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో "దేవర" అనే సినిమాలో నటించి మెప్పించాడు.


సినిమా టాక్ అటు ఇటుగా ఉన్న తారక్ పెర్ఫార్మన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. అసలు నటనపరంగా తారక్ ను వేలు పెట్టే ఆస్కారమే లేదు. అలాంటి ఓ స్టార్ స్టేటస్ అందుకున్నాడు తారక్ . కాగా తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అదే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను వాడే ఊత పదంకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టాడు. మరొకసారి ఆ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . తారక్ రెగ్యులర్గా వాడే ఊత పదం ఏంటో తెలుసా..?


"అరె నీ"..ఎస్ చాలామందికి ఈ ఊత పదం తెలిసే ఉంటుంది. తారక్ చాలా చాలా ఎక్కువగా  ఈ పదాన్ని వాడుతూ ఉంటారట . దాదాపు ఈ ఉతపదాన్ని రోజుకి ఒక 60 సార్లకు  పైగానే ఉపయోగిస్తూ ఉంటాడట . అంతేకాదు లక్ష్మీ ప్రణతితో కూడా సరదాగా మాట్లాడే మూమెంట్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారట . అయితే ఈ పదాన్ని ఆయనకి అలవాటు చేసింది  మాత్రం తారక్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ తెలుస్తుంది . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: