కియారా లైఫ్ ను టర్న్ చేయబోతున్న మీనాకుమారి !

Seetha Sailaja
దక్షిణాది సినిమా రంగంలో ‘మహానటి’ సావిత్రి జీవితంలో ఎన్ని మలుపులు ఎన్ని విషాదాలు ఉన్నాయో అంతకు మించిన ట్విస్ట్ లు బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి జీవితంలో ఉన్నాయి. 1950-60 ల మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన మీనాకుమారి అలనాటి టాప్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది.

విషాద పాత్రలు నుండి గ్లామర్ పాత్రల వరకు ఎలాంటి పాత్రను అయిన నటించి మెప్పించగల సామర్థ్యం ఆమె సొంతం. అందువల్లనే బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ చారిత్రాలలో ఆమె చరిత్ర ఒక సువర్ణాధ్యాయం. జాతీయస్థాయి ఉత్తమ నటిగా అవార్డులతో పాటు అనేక ఫిలిమ్ ఫేర్ అవార్డులను పొందిన ఈమె జీవితంలో అనేక విషాద అంశాలు ఉన్నాయి. ఆమె మరణం పై కూడ ఆరోజులలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తున్న పరిస్థితులలో ఆమె జీవితం పై ‘కమల్ ఔర్ మీనా’ అనే బయోపిక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో నిర్మింపబోతున్న ఈ బయోపిక్ లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మీనా కుమారిగా నటించబోతోంది. మొదట్లో ఈబయోపిక్ లో కృతి సనన్ మీనా కుమారిగా నాటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఈమూవీ దర్శక నిర్మాతలు కియార అద్వానీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

మీనాకుమారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈమూవీని నిర్మిస్తున్నట్లు టాక్. ఈ మూవీని దక్షణాది భాషలలొ కూడ డబ్ చేసి ఒకసారి పాన్ ఇండియా మూవీగా విఉదల చేయాలని నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. ప్రస్తుతం ‘డాన్ 3’ ‘వార్ 2 సినిమాలలో నటిస్తున్న కీయారా ఆ మూవీల షూటింగ్ పూర్తి చేసుకుని మీనా  కుమారి  పాత్ర కోసం రెడీ అవుతుందని సమాచారం. ఒకప్పుడు విద్యా బాలన్ కు సిల్క్ జీవితం పై తీసిన ‘డర్టీ’ పిక్చర్ ఎలాంటి పేరును తెచ్చిపెట్టిందో కీయారా కు కూడ మీనా కుమారి బయోపిక్ ఆమె క్రేజ్ ను మరింత పెంచే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: