ఉదయ్ కిరణ్ కెరీర్ ని టర్న్ చేసిన "నువ్వు నేను" మూవీ వెనుక నమ్మలేని నిజాలు..!!

Pandrala Sravanthi
- ఉదయ్ కిరణ్ కెరియర్ కే టర్నింగ్ పాయింట్..
- హీరోయిన్ కు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజ..
- నిర్మాతల పంట పండించిన నువ్వు నేను..

 
 కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అవుతూ ఉంటాయి.అలా విడుదలైన చిత్రాల్లో చాలా సినిమాలు భారీ హిట్లందుకొని మంచి గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నువ్వు నేను. ఈ మూవీ విడుదల సమయంలో దానిపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత థియేటర్లన్నీ  జనాలతో పోటెత్తాయి.  ఆ విధంగా ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించి రికార్డులను తిరగరాసింది. మరి అలాంటి నువ్వు నేను చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని వివరాలు చూద్దాం..
 నువ్వు నేను మూవీ:
తెలుగులో సంచలన విజయాలు సాధించిన చిత్రాలను వేళ్లపైన లెక్క పెట్టవచ్చు. అలాంటి వాటిలో నువ్వు నేను మూవీ కూడా ఒకటి. చిత్రం సినిమా తర్వాత దర్శకుడు తేజకు అవకాశాలు అనేకం వస్తున్నాయి. అలా వెంకటేష్ తో మూవీ చేసే ఛాన్స్ దక్కింది. ఇక కథ మొత్తం విన్నాక ఇంకో స్టోరీ ఉంటే చూడు అని చెప్పి నువ్వు నాకు నచ్చావ్ అనే కథను ఓకే చేశాడు వెంకటేష్. దీంతో తేజ నువ్వు నేను సినిమా వదిలేసినందుకు నిరుత్సాహపడ్డాడు. దీంతో తేజ వెనక్కి తగ్గకుండా ఒక కొత్త స్టోరీని తయారు చేసి  నిర్మాతకు చెప్పడంతో ఆయన కూడా ఓకే చెప్పాడు. హీరో కోటీశ్వరుడు హీరోయిన్ గొర్రెల కాపరి కూతురు.. ఇద్దరి మధ్య సాగే లవ్ స్టోరీ పై సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం ముందుగా అక్కినేని సుమంత్, మాధవన్ ను అడిగారు. కానీ వాళ్ళకి టైం కుదరక ఒప్పుకోలేదు. చివరికి ఎవరితో చేయాలో అర్థం కాక  ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఉదయ్ కిరణ్ తేజ దగ్గరికి వెళ్లారట. చివరికి ఒక ఆలోచనలో పడ్డ తేజ ఉదయ్ కిరణ్ నువ్వు బాడీ పెంచు నెక్స్ట్ సినిమాలో హీరో నువ్వే అని చెప్పారట.

 ఆ విషయం చెప్పడంతోనే ఉదయ్ ఆనందానికి అవధులు లేవు. అలా ఉదయ్ కిరణ్ హీరోగా సెట్ అయిపోయారు. చివరికి అనిత హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. కోటి 60 లక్షల బడ్జెట్. 2001 ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయింది నువ్వు నేను. ఫస్ట్ డే అంతగా సినిమా పుంజుకోలేదు. రెండో రోజు కూడా కాస్త డల్ గానే ఉంది. ఇక మూడవ రోజు నుంచి ఈ సినిమా టాక్ విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్లన్నీ యూత్ తో నిండిపోయాయి. గాజువాక పిల్లా అనే పాట అప్పట్లో ఓ రేంజ్ లో ఊపేసింది. అలా నువ్వు నేను మూవీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ చిత్రం ద్వారా ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయారు. మొత్తం 20 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఇలా చిన్న సినిమాగా వచ్చిన నువ్వు నేను అద్భుతమైన హిట్ సాధించి  దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లకు ఇతర నటీనటులకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: