నిర్మాతల తలరాతలనే మార్చేసిన.. చిత్రాలు ఇవే..!

Divya
ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలతోనే సినీ ఇండస్ట్రీ మనుగడ సాగుతోందని కూడా చెప్పవచ్చు. స్టార్ హీరోలను నమ్ముకుని చాలామంది నిర్మాతలు బయ్యర్లు ఎగ్జిక్యూటర్లు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం చిన్న సినిమాలే చాలామందిని కాపాడుతూ ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కార్తికేయ-2, బింబిసార, కాంతార ఇతరత్న సినిమాలు  బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి. అలాంటి సినిమాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతాగోవిందం సినిమా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు. ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 70 కోట్ల షేర్ ని కాబట్టి 55 కోట్ల లాభాన్ని అందించింది.

ఉప్పెన సినిమా 2021లో విడుదల అయింది ఇందులో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు ఈ సినిమా 20 కోట్ల రిలీజ్ బిజినెస్ జరగగా 50 కోట్ల షేర్ రాబట్టింది. సుమారుగా 31 కోట్లకు పైగా లాభాన్ని అందించింది.

శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఫిదా సినిమా 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. 50 కోట్ల షేర్ని రాబట్టింది.. 30 కోట్ల లాభాన్ని అందించింది.

అనుపమ, నిఖిల్ కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ-2 సినిమా 12.8 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా 121 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.. దీంతో నిర్మాతలకు 45 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది. డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాని తెరకెక్కించారు.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లు వచ్చిన సీతారామం సినిమా 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 46.5 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో నిర్మాతలకు 30 కోట్లకు పైగా లాభాలను అందించింది.

డైరెక్టర్ పూరి, హీరో రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్..17.7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగదు సుమారుగా 41 కోట్ల షేర్ ను రాబట్టింది.. ఓరల్ గా ఈ సినిమా 22 కోట్లకు పైగా లాభాలను అందించింది.

వీటితోపాటు కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో 22 కోట్లు.. అర్జున్ రెడ్డి సినిమా 20 కోట్లు, కాంతారావు సినిమా 16 కోట్లు లాభాలను అందించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: