కీర్తి సురేష్ ను అలా పిలిచే ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఇతడే.. ఆమెకు ఎంత స్పెషల్ అంటే..!

Thota Jaya Madhuri
సాధారణంగా ఏ సినిమాకు అయిన వర్క్ చేసే మూమెంట్లో ఆ సినిమా చేస్తున్న హీరో - హీరోయిన్ బాగా క్లోజ్ అవుతారు . మింగిల్ అవుతారు. అప్పటివరకు వాళ్ళ మధ్య పరిచయం లేకపోయినా సరే చాలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కలిసిపోతూ ఉంటారు . అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెద్దగా కలవరు. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాలల్లో నటించే స్టార్ హీరోయిన్స్ తమ పనులు చూసుకుని మిగతా సినిమాలకు సంబంధించిన పనులకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .


అయితే వాళ్లందరిలోకి చాలా చాలా డిఫరెంట్  ఈ బ్యూటీ కీర్తి సురేష్ . మహానటి అంటూ ట్యాగ్ చేయించుకుని మరి ట్రెండింగ్ లో ఉంటున్న ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే ఇండస్ట్రీని ఏలేసే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కాగా ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూసాము. ఇప్పటివరకు ఏ సినిమాలోనో హద్దులు మీరని  కీర్తి సురేష్.. బాలీవుడ్ లో నటించే సినిమా కోసం మాత్రం బాగా లిమిట్స్ క్రాస్ చేస్తుంది అంటూ బాగా బాగా ఎక్కువుగా వార్తలు వినిపిస్తున్నాయి .


ఇలాంటి మూమెంట్లోనే  కీర్తి సురేష్ ని "కీతూ" అంటూ ముద్దుగా పిలిచే స్టార్ హీరోకి సంబంధించిన డీటెయిల్స్ బయటపడ్డాయి . ఆ హీరో మరెవరో కాదు "న్యాచురల్ స్టార్ నాని".  నాని - కీర్తి సురేష్  గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువే . కీర్తి సురేష్ - నాని కాంబోలో వచ్చిన సినిమాలు అని బ్లాస్టింగ్ హిట్స్ అందుకున్నాయి. వీళ్ళిద్దరి జంటకి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . ఇద్దరి జంట తెరపై కనిపిస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాస్ట్ అవ్వాల్సిందే.  ఆ రేంజ్ లోనే కలెక్షన్స్ కురిపిస్తాయి. అంత మంచి కెమిస్ట్రీ వీళ్ళ మధ్య పండుతుంది . వీళ్లిద్దరూ చాలా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆ కారణంగానే "కీతూ.. కీతూ" అంటూ నాని..హీరోయిన్ కీర్తి సురేష్ ని పిలుస్తాడట.  అంతేకాదు ఏకంగా నాని ఇంట్లోకి వెళ్లి కీర్తి సురేష్ దోసెలు కూడా వేసుకొని తింటుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: