చిన్న సినిమాగా రిలీజ్ అయి.. ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న బోల్డ్ మూవీ..!!

murali krishna


టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తరువాత ఆ రేంజ్ బోల్డ్ మూవీ రాదులే అని అంతా అనుకున్నారు.. కానీ అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్ మూవీస్ కి ద్వారం తెరిచినట్లయింది.. అయితే మరి బోల్డ్ గా కాకుండా హత్తుకునే ప్రేమకథతో పాటు కాసంతా బోల్డ్ సీన్స్ తో సినిమాలు రిలీజ్ అయ్యాయి.. అలాంటి సినిమాలలో ఆర్ ఎక్స్ 100 సినిమా ఒకటి.. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100 మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి అద్భుత విజయం అందుకున్నాడు.. ఈ సినిమాలో శివ పాత్రలో నటించిన కార్తికేయ అద్భుతంగా నటించాడు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ హీరోయిన్ పాత్ర..పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ’ఇందు’ అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది.. ఎంతలా అంటే ఆ పాత్రను వేరే హీరోయిన్ ఎవరు చేయలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.. అయితే హీరో, హీరోయిన్ కీ తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం..ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు రావు రమేష్ మరియు సీనియర్ నటుడు రామ్కీ కూడా అద్భుతంగా నటించారు

.ప్రేమ పేరుతో ఓ అబ్బాయిని అమ్మాయి ఏ విధంగా మోసం చేసింది.. ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న అబ్బాయి నిజం తెలుసుకుని ఆ అమ్మాయిని ఏం చేసాడు అన్నదే ఈ సినిమా స్టోరీ.. అయితే నిజంగా జరిగిన ఈ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.. శివ పాత్రలో కార్తికేయ పండించిన ఎమోషన్ అందరిని కట్టి పడేసింది.. ఇక ఇందు పాత్రలో పాయల్ కన్నింగ్ లుక్స్, చేష్టలు, అలాగే బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.. ఈ సినిమా తరువాత  పాయల్ కు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి..ఆర్ ఎక్స్ 100 సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి.. అలాంటి కథను అజయ్ భూపతి సినిమాగా తెరకేక్కించడంతో యువత ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ కీ క్యూ కట్టారు.. ఈ సినిమాలో కథ ఎంత బలమైందో దానికి తగ్గట్టు వచ్చే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది.. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ యూత్ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: