టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు..వస్తున్నాయి.అయితే ఇందులో కొన్ని సినిమాలు
సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఇక చిన్న చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బంపర్ హిట్...కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో బేబీ
సినిమా ఒకటి. 2023 సంవత్సరంలో.. తక్కువ బడ్జెట్ లో వచ్చి 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా బేబీ రికార్డు సృష్టించింది. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ
సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టింది.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ
సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో
ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి
చైతన్య హీరో హీరోయిన్లుగా చేశారు.
ప్రేమ నేపథ్యంలో ఈ
సినిమా వచ్చింది. 10 కోట్ల తో ఈ
సినిమా చేస్తే దాదాపు 100 కోట్లు దాటిపోయాయి ఈ
సినిమా కలెక్షన్లు. అంతలా ప్రభంజనం సృష్టించింది బేబీ సినిమా. ఇద్దరు యువకుల తో
హీరోయిన్ ప్రేమాయణం నడిపించడం... ఆ తర్వాత జ్ఞానోదయం కావడమే ఈ
సినిమా స్టోరీ.
అయితే ఇద్దరు యువకులను ప్రేమించే నేపథ్యంలో... ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి... అసలు
అమ్మాయి ఎందుకు చేసింది అనేది సినిమా. ఇక 2023 జూలై 14 వ తేదీన రిలీజ్ అయిన బేబీ సినిమా... మహేష్ బాబు అలాగే పవన్
కళ్యాణ్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. తెలుగు సినిమాలలో అత్యధిక లాభాలు పొందిన.. లిస్టులో బేబీ
సినిమా మూడవ స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ లిస్టులో గీతగోవిందం
సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత
హీరో నిఖిల్ చేసిన
కార్తికేయ 2
సినిమా ఉంది. అయితే ఈ సినిమాల తర్వాత మూడవ స్థానంలో నిలిచింది బేబీ సినిమా. బేబీ తర్వాత ఉప్పెన అలాగే
ఫిదా సినిమా కూడా నాలుగు అలాగే ఐదు స్థానాల్లో ఉన్నాయి. అంటే పవన్
కళ్యాణ్ అలాగే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా... అందుకోలేని సంచలన రికార్డు నమోదు చేసింది బేబీ.