కమిటీ కుర్రాళ్ళు : చిన్న సినిమాగా వచ్చి పెద్ద మూవీలకే స్ట్రోక్ ఇచ్చింది..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు ముందుకు వచ్చే చిన్న సినిమాలు పైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానితో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా విడుదలగా రెడీగా ఉంది అంటే ప్రేక్షకులు ఆ సినిమా ఎలా ఉంది ... అది బాగుంది అంటే చాలు ఆ మూవీ ని థియేటర్లకి వెళ్లి చూడడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో రీసెంట్ టైమ్ లో స్టార్ హీరోలు నటించిన సినిమాల కంటే కూడా మంచి కలెక్షన్లను వసూలు చేసిన చిన్న సినిమాలు కూడా చాలా ఎక్కువ గానే ఉన్నాయి.

అలాంటి సినిమాలలో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఒకటి. యదు వంశీ అనే దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదల నిహారిక నిర్మించింది. ఈ సినిమాలో అనేక మంది కొత్త నటీ నటులు నటించారు. కానీ వీరంతా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే విడుదలకు ముందు నిహారిక ఈ సినిమా ప్రమోషన్లను చాలా పెద్ద ఎత్తున నిర్వహించడంతో చిన్న సినిమా అయిన ఈ మూవీ పై కాస్త మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. దానితో చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకొని కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీని ఇచ్చింది. ఇలా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: