ప్రెస్ మీట్ లో 'కంగువ' స్టోరీ చెప్పేసిన సూర్య.. ఇంతకీ కథ ఏంటంటే?

praveen
ఇటీవల కాలంలో ప్రేక్షకుల పంథా మారిపోయింది. దీంతో ఒకప్పటిలా కమర్షియల్ సినిమాలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. ఒకప్పుడు స్టార్ హీరో తెరమీద కనిపించి.. నాలుగు ఫైట్లు నాలుగు సాంగులు ఉన్నాయి అంటే చాలు ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంతటి స్టార్ హీరో అయినా సరే సినిమా కథలో బలం లేకపోతే మాత్రం తప్పకుండా డిజాస్టర్ తప్పట్లేదు. దీంతో ఇక స్టార్ హీరోలు కూడా ఇక సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

 ఈ క్రమంలోనే ఇక ఇలా స్టార్ హీరోలు ఎంచుకుంటున్న సరికొత్త కథలపై అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు విభిన్నమైన జానర్లు ఎంచుకుంటూ సినిమాలతో ప్రయోగాలు చేసే హీరో సూర్య అటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో కంగువ అనే మూవీ తెరకెక్కుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే సూర్య కంగువ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనే విషయంపై సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఇదే విషయంపై ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు హీరో సూర్య. కాంగువ సినిమా 700 ఏళ్ల క్రితం జరిగిన కథ అంటూ హీరో సూర్య చెప్పుకొచ్చాడు. ఇది కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదని ఎమోషన్స్ తో కూడుకున్నది అంటూ చెప్పుకొచ్చారు. 5 దీవుల్లో ఉండే ప్రజల మధ్య ఎందుకు పోరు జరుగుతుంది అనేది ఈకథలోని ముఖ్య కథాంశం అంటూ తెలిపాడు. ఈ సినిమాలో ప్రస్తుత కాలం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: