ఏ మూవీ రీమేక్ చేస్తారు.. విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి రాణించటం అంటే అది ఎంత కష్టమైన విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలతో సినిమాలు తీయడానికి దర్శకులు నిర్మాతలు కూడా భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇతర హీరోల సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసే స్థాయి నుంచి ఏకంగా తన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేసే స్థాయికి ఎదిగాడు.

 పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ చూపు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్దగా హిట్టు కొట్టలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. ఇక ఇటీవల తన మనసులో ఉన్న ఒక మాటను బయట పెట్టాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన లక్కీ భాస్కర్ అనే మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

 ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కి రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ అటు స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈవెంట్లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. ఒకవేళ మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏ హీరో సినిమాను రీమేక్ చేస్తారు అంటూ సుమా ప్రశ్నించింది. దీనికి బదులుగా తాను 1989లో పుట్టానని ఆ సమయంలో ఆర్జీవి దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ రిమేక్ చేయాలని అనుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న మూవీలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: