పెళ్ళైన రామ్ చరణ్ పై మోజు పడుతున్న కుర్ర బ్యూటీ.. ఒక్క ఛాన్స్ అంటూ.?

Pandrala Sravanthi
 చాలామంది హీరోలకు పెళ్లి అయినా సరే అభిమానులు మాత్రం పెళ్లయితే మాకేంటి అన్నట్లు మాట్లాడతారు.. చాలామందికి మొదటి నుండి ఉన్న క్రష్ పెళ్లయినా కూడా తగ్గదు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ రేంజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కూడా ఎంతో అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి హీరోల లిస్టులో రామ్ చరణ్ కూడా ఉంటారు. అయితే ఈ హీరోకి కేవలం సాధారణ అమ్మాయిలు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా అభిమానులుగా ఉన్నారు. అయితే తాజాగా ఆ సినిమాలోని క్యారెక్టర్ ద్వారా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయిన ఓ నటి కూడా రామ్ చరణ్ అంటే తెగ ఇష్టపడిపోతుంది.ఇక రామ్ చరణ్ కి పెళ్లి అయింది అనే విషయం తెలిసి చాలా బాధపడిందట.కానీ పెళ్లయితే నాకేంటి నా అభిమానం ఎక్కడ పోదు అంటూ ఒక్కసారి ఆ ఛాన్స్ కావాలి అని చెబుతోంది. 

ఇక విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా మత్తు వదలరా -2  మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో రియా పాత్రలో నటించిన ఇషా యాదవ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడంతో చాలామంది యూట్యూబర్లు ఈమెతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అలా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా యాదవ్ మాట్లాడుతూ.. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పటి నుండే నాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే పిచ్చి ఇష్టం ఏర్పడింది. ఆయనపై అప్పటినుండే నాకు ప్రేమ కలిగింది. అయితే ఈయన నటించిన బెట్టింగ్ రాజా (ఈ మూవీ హిందీలో రచ్చ మూవీ డబ్బింగ్ వర్షన్ ) చూసినప్పటినుండే రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అయితే కొద్దిరోజులకి రామ్ చరణ్ కి పెళ్లి జరిగింది అనే విషయం తెలిసి ఎంతగానో బాధపడ్డాను.

ఇక రీసెంట్ గా ఆమెకు పాప పుట్టింది అనే విషయం తెలిసి మరింత బాధపడ్డాను. కానీ పెళ్లయితే ఏంటి ఆయనతో ఒక్కసారైనా సినిమాలో నటించాలి అనుకుంటున్నాను. ఇక నేను మత్తు వదలరా -2 మూవీలో నటిస్తున్న సమయంలో నిర్మాత దగ్గరికి వెళ్లి రామ్ చరణ్ మూవీలో ఒక్క అవకాశం ఉంటే ఇప్పించండి ప్లీజ్ అని ఆయన్ని చాలా బతిమిలాడాను అంటూ ఇషా యాదవ్ చెప్పుకొచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.ఇక ఇషా యాదవ్ నటించిన మొదటి సినిమా మత్తు వదలరా-2.. అంతకుముందే పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. కానీ అంత ఫేమస్ అవ్వలేదు. మత్తు వదలరా -2 మూవీ ఇషా యాదవ్ కి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా లోని ఇషా యాదవ్ నటనకి చాలామంది అభిమానులు ఫిదా అయిపోయారు. దాంతో ఈమెకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: