16 ఏళ్లకే హీరోయిన్... 21 ఏళ్లకే తల్లి... ఇప్పటకీ వన్నె తరగని అందం..ఎవరా హీరోయిన్..!
1974 అక్టోబర్ 26న ఆమె జన్మించింది. 1991లో సల్మాన్ ఖాన్ హీరోగా పత్తర్ కి పూల్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న రవీనా.. తర్వాత గోవిందా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లాంటి హీరోలతో కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. రవీనా 2004లో ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ని వివాహం చేసుకుంది. ఉపేంద్ర సినిమా ద్వారా కన్నడ సినిమాలకి అడుగుపెట్టిన రవినా.. ఆ తర్వాత దక్షిణాదిలో పలు సినిమాలలో నటించింది.
తెలుగులో బాలయ్య సరసన బంగారు బుల్లోడు, నాగార్జునకి జోడిగా ఆకాశ వీధిలో సినిమాలు చేసింది. చాలాకాలం తర్వాత ఆమె భారీ పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 లో కీలక పాత్ర పోషించింది. ఇందులో రమ్మికా న్ అనే పాత్రలో ఆమె నటించింది. 16 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా.. 20 ఏళ్ల వయసులో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. పిల్లలను దత్తత తీసుకునే సమయానికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఇక రవీనా టండన్.. అజయ్ దేవగణ్ ముంబై కాలేజీలో కలిసి చదువుకున్నారు. కెరీర్ ఫామ్లో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్, రవీనా ప్రేమలో పడ్డారు. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అనుహ్యంగా ఇద్దరు విడిపోయారు.