21 ఏళ్ల నాగ్‌ ' శివ‌మ‌ణి ' లో అదిరిపోయే టాప్ - 10 పంచ్ డైలాగ్స్ ..!

RAMAKRISHNA S.S.
అక్కినేని నాగార్జున సినిమాలలో శివమణి ప్రత్యేకమైన సినిమా. అప్పటివరకు నాగార్జున చాలా ప్రేమ కథ, యాక్షన్ సినిమాలలో నటించారు. కానీ.. శివమణి పూర్తిగా పూరి.. మార్క్ టిపికల్ యాక్షన్ సినిమా అని చెప్పాలి. శివమణి క్యారెక్టర్ లో నాగార్జున ఒదిగిపోయారు. అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఆసిన్.. ఇడియట్ సినిమాతో పూరి పరిచయం చేసిన రక్షిత ను శివమణి సినిమాలో హీరోయిన్‌లుగా పెట్టాడు పూరి జగన్నాథ్. 2023 అక్టోబర్ 23న శివమణి రిలీజ్ అయింది. పూరి ఈ సినిమాను మరో ప్రముఖ నిర్మాత డివివి దానయ్యతో కలిసి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితం అందుకుంది.

77 కేంద్రాల్లో 50 రోజులు 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చిరంజీవి ఠాగూర్, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు పోటీగా ఉన్న.. వాటి పోటి తట్టుకుని శివమణి సూపర్ హిట్ అవటం విశేషంగా చెప్పుకోవాలి. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చార్జి తీసుకున్న శివమణికి.. అక్కడ దత్తు అని రౌడితో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అతడి మేనకోడలనే ప్రేమిస్తాడు శివమణి. ఈ సినిమాలో డైలాగులు అదిరిపోయాయి. శివమణి సినిమాలో బెస్ట్ డైలాగ్స్ పై ఒక లుక్కువేద్దాం.

1) " నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్.. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని..
2) ఇప్పటివరకు ఎవరు ఏం చేశారు అని నేను అడగ.. కానీ అన్ని ఆపేయండి.. సడన్గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది.. అలవాటు చేసుకోండి.. మానటానికి ట్రై చేయండి.. ".
3) "తప్పు చేసిన ప్రతిరోజు.. రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి.. శివమణి గాడి చేతిలో మిస్ అయినందుకు ",
4) "పోలీసులంటే భయం లేదురా మీకు.. ఎప్పుడు కలలోకి రాలేదా ఇప్పుడు వస్తాడు.. ఈ శివమణి గాడు వస్తాడు", "మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటా.. రెండు నిమిషాల్లో వస్తా..",

5) మ్యూజిక్ అంటే ఇష్టమా.. నాకు ప్రాణం.. విను వాడొద్దు ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అస్సలు వాడొద్దు..
6) షాప్ కి వచ్చామా, కొన్నామా, వెళ్ళామా అంతే.. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు..",
7) "రేయ్ నేను డ్యూటీలో జాయిన్ అయి నాలుగు ఏళ్ళు అయింది.. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కి అయినా ఫోన్ చెయ్యి శివమణి గాడు ఆపేయమన్నాడు పెట్టుకోవచ్చా అని అడుగు.. ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అని అంటే పెట్టుకో.. ఆ తర్వాత నీ సైడ్ కి కూడా రాను".
8) " డిగ్రీ అయ్యుండి నాకే ఒళ్ళు మండిపోతుంది. ఐ.పి.ఎస్ చేసిన మీకు సిగ్గు వేయటం లేదా..",
9) "ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారి ఉంటుంది. తంబి అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి.. నేను ఇప్పుడు దాన్ని వాడతాను".

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: