చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన కుమారి 21ఎఫ్.. భారీ లాభాలు అందించిందిగా!

Reddy P Rajasekhar
కొన్నిసార్లు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. అలా మ్యాజిక్ చేసిన చిన్న సినిమాలలో కుమారి 21ఎఫ్ కూడా ఒకటి. కుమారి 21ఎఫ్ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్టర్ కాగా ఈ సినిమా కథ, కథనం విషయంలో సుకుమార్ హెల్ప్ చేశారు. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, సుకుమార్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకున్నారని సమాచారం అందుతోంది.
 
చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించి కుమారి 21 ఎఫ్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 18 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. కుమారి 21ఎఫ్ సక్సెస్ నిర్మాతలకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించగా ఈ సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కింది.
 
రాజ్ తరుణ్ కు ఈ సినిమా తర్వాత ఈ సినిమా రేంజ్ విజయం మాత్రం దక్కలేదనే చెప్పాలి. కుమారి 21ఎఫ్ సక్సెస్ హెబ్బా పటేల్ కెరీర్ సైతం ప్లస్ అయింది. సినిమాలో గ్లామరస్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పద్ధతిగానే కనిపించడం కొసమెరుపు. రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
 
రాజ్ తరుణ్ తనను తాను విశ్లేషించుకుని సరైన ప్రాజెక్ట్ తో ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అలా చేయని పక్షంలో కొత్త మూవీ ఆఫర్లు రావడం కష్టమేనని తెలుస్తోంది. రాజ్ తరుణ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. కుమారి 21ఎఫ్ సక్సెస్ సాధించినా డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కెరీర్ మాత్రం పెద్దగా పుంజుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: