ఓరి దుర్మార్గుడా.. ఆఖరికి సమంత లాస్ట్ ఆ జ్ఞాపకాని కూడా చెరిపేశావు కదరా..?

Thota Jaya Madhuri
అక్కినేని హీరో నాగచైతన్య అంటే అందరికీ ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది . ఎక్కడ కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేయడు. తన పని తాను చూసుకుని పోతూ ఉంటాడు అని ఎప్పటినుంచో ఆయనపై పాజిటివ్ గానే మాట్లాడుతూ వచ్చారు జనాలు . అంతేకాదు ఆయనపై చాలా నమ్మకాన్ని కూడా పెట్టుకున్నారు . మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన క్రేజ్ మారిపోయింది.  ఆయన స్థానం కూడా వేరే లెవెల్ లోకి వెళ్ళింది. అప్పటివరకు హీరోగా మాత్రమే ఉన్నాడు అప్పటినుంచి ఆయన సమంత భర్తగా పలు ఇండస్ట్రీలలో కూడా బాగా పబ్లిసిటీ దక్కించుకున్నారు . అయితే కొన్ని కారణాల చేత వీళ్లిద్దరు విడిపోయారు . సమంతతో కలిసి ఉన్నప్పుడు చాలా చక్కగా ఆమెతో ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నాగచైతన్య ఇప్పుడు ఆ ఫొటోస్ ని డిలీట్ చేస్తూ సమంత అభిమానులకు మండించేలా చేస్తున్నాడు .


మనకు తెలిసిందే త్వరలోనే హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ పెళ్లికి సంబంధించిన అన్ని పనులను చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు ఇరు  కుటుంబ సభ్యులు.  త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ జంటగా కనిపించబోతున్నారు.  మెడలో మూడు ముళ్ళు వేసి పట్టు బట్టల్లో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు . అయితే ఇది అక్కినేని ఫ్యాన్స్ కి హ్యాపీగానే ఉన్న నాగచైతన్య తాజాగా చేసిన పని మాత్రం సమంత ఫ్యాన్స్ కు మండించేలా చేస్తుంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా   ఆమెపై పాజిటివ్ గా కామెంట్స్ చేశాడు నాగచైతన్య . ఆమెతో ఉన్న జ్ఞాపకాలను కొన్ని కొన్ని డిలీట్ చేశారు. అయితే నాగచైతన్య ఆమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు డిలీట్ చేసిన ఒక ఫోటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు.


అంతేకాదు విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు వాళ్ళిద్దరూ కలిసి నటించిన మజిలికి సంబంధించిన పోస్టర్ కూడా అలాగే వదిలేశాడు .అంతేకాకుండా సమంతతో కలిసి రెస్ట్ క్రాఫ్ట్ లో తీసిన ఫోటో కూడా అలాగే ఉంచేసాడు . దీనికి "బ్యాక్ త్రో మిస్సెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ " అని క్యాప్షన్ కూడా ఉంది. అయితే తాజాగా ఆ ఫోటోని నాగచైతన్య ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక సమంతతో పనిలేదు అనుకున్నాడో ఏమో . ఆ ఫొటోస్ ని డిలీట్ చేసేసాడు నాగచైతన్య అంటూ సమంత ఫ్యాన్స్ మండి పడుతున్నారు . మరి కొందరు ఆఖరికి ఆ జ్ఞాపకాన్ని కూడా చెరిపేసావా అంటూ ఫైర్ అయిపోతున్నారు. నాగచైతన్య నీపై ఇంత పాజిటివ్ గా అనుకున్నాం నువ్వు ఇలాంటి వాడివా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: