ఒకే ఒక్క "మాట".. సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్న రాశి ఖన్నా.. ఉన్న పరువు మొత్తం పోయిందిగా..!

Thota Jaya Madhuri
రాశిఖన్నా..ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోదామని వచ్చి స్టార్ హీరోయిన్గా మారలేక వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతున్న ఒక హీరోయిన్ . రాశి కన్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత కాలం అవుతుందో మనకు తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించింది . ఆమె నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అనుకోలేము కానీ ఖచ్చితంగా యావరేజ్ గా ఉంటాయి ..ఆమె పెర్ఫార్మెన్స్ బాగుటుంది అని చెప్పచ్చు.


కానీ బడాబడా స్టార్ హీరోలు మాత్రమే అవకాశం ఇవ్వలేకపోయారు . దానికి కారణం ఆమె నటన . ఆమె నటన ఏదో చిన్న పిల్లలు యాక్ట్ చేసిన విధంగా ఉంటుంది . కానీ మెచ్యూరిటీ లెవెల్స్ అస్సలు ఉండవు అనే కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలో నటించింది . ఆశ్చర్యమేంటంటే అక్కడ కూడా స్టార్ గా మారలేకపోయింది. ఆమె తెలుగులో నటించిన ఏకైక బడా స్టార్ తారక్ మాత్రమే.  "జై లవకుశ" సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నింది.


రాశి ఖన్నా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లిపై రియాక్ట్ అయింది . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తన పెళ్లి వార్త ఏ విధంగా వైరల్ అయిందో మనం చూసాం. ఇదే క్రమంలో ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయింది రాసి ఖన్నా. " నా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.  కానీ అది ఏది నిజం కాదు.  నాకు ఉంది పెళ్లి చేసుకోవాలి అని పిల్లల్ని కనాలి అని.. కానీ ఇది ఇప్పుడు టైం కాదు . దానికి ఇంకా చాలా చాలా టైం ఉంది . నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఆ విషయం ముందు మీకే చెప్తాను. దయచేసి నా పెళ్లిపై వార్తలు సృష్టించవద్దు. అది నాకు చాలా ఇబ్బంది కలుగచేస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది.  అంతేకాదు ఇదే టైం లో ఆమెకు సంబంధించిన పాత వీడియో  కూడా బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో రాశి ఖన్న పెళ్లైన స్టార్ హీరోని ప్రేమించింది అని ఈ హీరో కోసం స్టార్ హీరో తన భార్య కి కూడా విడాకులు ఇవ్వాలనుకున్నారు అని చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆమెను చాలా మంది ట్రోల్ కూడా చేశారు . ఇలాంటి గబ్బు పనులు చేస్తున్నావా..? నువ్వు" అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: