మాటలతో మాయచేసిన త్రివిక్రం "మా"టలకి అర్ధం అదేనా..? ఏం హింట్ ఇచ్చావ్ గురూ..!

Thota Jaya Madhuri
త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన తన మాటలతోనే మాయ చేసేస్తూ ఉంటాడు అని అంతా అంటూ ఉంటారు . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు.. ఆయన రచయితగా వర్క్ చేసిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఏ మాట కూడా నోరు జారి మాట్లాడడు. వన్స్ ఆ మాట అన్నాడు అంటే దాని వెనక ఎంతో పెద్ద అర్థం ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .


దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా  నటించిన తాజా సినిమా "లక్కీ భాస్కర్". ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది.  సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై శ్రీ సూర్యదేవ నాగవంశి అలాగే సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమైంది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు. కాగా రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు .


మరి ముఖ్యంగా త్రివిక్రమ్ , విజయ్ దేవరకొండ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రావడం హైలెట్ . ఇదే క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎప్పుడు లేని విధంగా విజయ్ దేవరకొండను ఓ రేంజ్ లో పొగిడేసారు . "నాకు బాగా నచ్చే నటులలో ఒకరు విజయ్ దేవరకొండ . ఇతనిను ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు . ఇతను ఎంత ప్రేమను చూశాడో అంతకంటే ద్వేషాన్ని అతి తక్కువ టైంలోనే చూశాడు. చిన్న వయసులోనే ఈ రెండు చూసేసాడు అంటే చాలా గుండె ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ మంచి స్థానానికి చేరుకుంటారు.  జీవితంలో ఇంకా ఇలాంటివి చాలా చూడాలి అని సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను "అంటూ చెప్పుకొచ్చారు .


అయితే కొంతమంది విజయ్ ని పొగిడావా..? తిట్టావా..? అంటుంటే మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాటల్లో చాలా అర్థం ఉందని . ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఇలాగే ద్వేషించారు అని ఇప్పుడు ఆయన ఒక స్టార్ అయ్యాడు అని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థానాన్ని రీప్లేస్  చేయబోయేది విజయ్ దేవరకొండ అని హింట్ ఇచ్చాడు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాటలను ప్లస్ గా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు త్రివిక్రమ్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: