అల్లుడికి అద్దిరిపోయే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..అత్త దెబ్బ అదుర్స్..!

Thota Jaya Madhuri
ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . సాధారణంగా ఎక్కడైనా కూడా ఏ ఇండస్ట్రీ అయినా కూడా స్టార్ హీరో , హీరోయిన్ , డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్ నయనతార తల్లికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . దానికి కారణం ఏంటో ఇప్పటికే అర్థం కావడం లేదు . కాగా నయనతార తల్లికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూనే ఉంటాయి.


మరి ముఖ్యంగా నయనతార విగ్నేశ్ శివన్ .. నయనతార తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో.. ఆ ఫొటోస్ ని షేర్ కూడా చేస్తూ ఉంటారు . నయనతార కి అంత అందం రావడానికి కారణం నయనతార తల్లి అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు . నయన్ తల్లి సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నయనతార తల్లి తన అల్లుడు విగ్నేశ్ కి అద్దిరిపోయే షాక్ ఇచ్చింది అంటూ ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు ఆశ్చర్య పోతుంది.


నయనతార ఏ నిర్ణయం తీసుకున్న సరే అది కచ్చితంగా ఆమె తల్లికి చెప్తుంది . నయనతార తల్లి తీసుకున్న డెసిషన్ ని ఎప్పుడూ కూడా నయనతార వ్యతిరేకించదు. ఆ విషయం ఆమె దగ్గర స్నేహితులకు మాత్రమే తెలుసు. అయితే నయనతార తన సంపాదించిన ఆస్తిని తన పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం పెళ్లి తర్వాత భర్త పేరు పైకి మార్చేసింది అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఇప్పుడు నయనతార తల్లి అల్లుడికి భారీ షాక్ ఇచ్చింది అంటూ తెలుస్తుంది.


నయనతార తల్లి ఇప్పుడు విగ్నేశ్ పేరు పై ఉన్న ఆస్తులు మొత్తం తన మనవాళ్లు "ఉయిర్,ఉల్గం" పేర్లు పైకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మాట్లాడిందట. నయనతార కూడా అందుకు ఓకే చెప్పారట. నిజానికి విగ్నేశ్ కి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు.  మొత్తం నయనతార సంపాదనే. నయనతార స్టార్ స్టేటస్ అందరికీ తెలిసిందే. అయితే పెళ్లయిన కొత్తలో భర్తపై ప్రేమతో భర్తకు రాయించిన ఆస్తిని ఇప్పుడు కొడుకులపై ప్రేమతో కొడుకుల పేర్లు పై రాస్తుందట. అమ్మ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుందట నయన్. అత్తముందు చూపు అల్లుడికి అద్దిరిపోయే దెబ్బ  అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: