తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి , ప్రభాస్ హీరోగా రూపొందిన మున్నా అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తారక్ హీరోగా బృందవనం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలను కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ మున్నా సినిమా ద్వారా వంశీ పైడిపల్లి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత బృందావనం హిట్ కొట్టడానికి ఏం చేశాడు అనే వివరాల్లో తెలియజేశాడు. దిల్ రాజు మాట్లాడుతూ ... మున్నా సినిమా ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. సినిమా విడుదల అయ్యాక ఆ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. దానితో వంశీ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అలాగే చాలా లో లోకి కూడా వెళ్లాడు. దానితో నేను అతనితో నువ్వు సినిమాను బాగానే చేశావు. కథ విషయంలోనే తేడా కొట్టింది. నెక్స్ట్ టైం అలాంటి పొరపాటు జరగకుండా చూసుకో కథ రెడీ చేసుకో అని చెప్పాను. ఆయన చాలా మంది రైటర్స్ తో చాలా సమయం కష్టపడి బృందవనం కథను రెడీ చేశాడు. దానిని ఎన్టీఆర్ కు వినిపించగా ఆయన ఒకే చెప్పాడు.
ఇక ఆ తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వంశీ చాలా సాటిస్ఫై అయ్యాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే వంశీ పైడిపల్లి ఆఖరుగా తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారిసు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ సినిమా తెలుగులో వారసుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలాకాలం అవుతున్న వంశీ తన తదుపరి మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు మరి ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీ ని ఏ హీరోతో చేస్తాడో చూడాలి.