సెట్ లో లిప్ కిస్... ఏడుస్తూ పారిపోయిన హీరోయిన్?
ఆర్టిస్టుల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలిసిన రేఖ తన పిన్ని మహానటి సావిత్రి వలే తన జీవితం కష్టాలపాలు కాకూడదని రేఖ ముందుగానే జాగ్రత్తపడి భారీగా ఆస్తులను దక్కించుకుంది. రేఖ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇదిలా ఉండగా.... 1969లో రేఖ బిస్వజిత్ చటర్జీ సరసన హీరోయిన్గా నటించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. అయితే ఈ సినిమాలో రేఖ ఓ రొమాంటిక్ సన్నివేశం చేయాల్సి ఉంటుందని డైరెక్టర్ కోరారు.
అందుకు రేఖ కూడా ఒప్పుకుంది. అయితే హీరో ఆమెకి చెప్పకుండానే ఓ సీన్ లో ముద్దు పెట్టాడట. దీంతో ఆమె షాక్ కి గురై అక్కడి నుంచి కోపంగా ఏడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. దీంతో చిత్ర యూనిట్ అంతా షాక్ అయ్యారు. అలా వెళ్ళిపోయింది రేఖ ఏంటి? అని అందరూ భయపడి డిస్కర్షన్ పెట్టుకున్నారట. ఆ తర్వాత కొంతమంది ఆమెను బుజ్జగించి మళ్లీ బయటకు తీసుకువచ్చి షూటింగ్ కొనసాగించారట. ఇక ఈ విషయాన్ని ది అన్ టోల్డ్ స్టోరీలో వెల్లడించారు.
ఇక రేఖ వ్యక్తిగత విషయంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఆమె మొదటగా నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నటిగా సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రేఖ అంచెలంచెలుగా ఎదిగింది. అనంతరం ఓ స్టార్ హీరో కారణంగా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రేఖ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు, హిందీలో అనేక సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం రేఖ సినిమాలకు కాస్త దూరంగా ఉంది.