రుక్మిణి వసంత్ కు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా..?

murali krishna
కన్నడ మూవీ “సప్త సాగరదాచే ఎల్లో” మూవీ ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ అయింది..ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ తెలుగు ప్రేక్షకులకు క్రష్ గా మారింది.. ఆ సినిమాలో రుక్మిణి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..తాజాగా ఈ కన్నడ కస్తూరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో నేరుగా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. అంతేకాదు ఆమె న‌టించిన క‌న్న‌డ మూవీ ‘భ‌గీర’ కూడా ఈ దీపావ‌ళి కానుకగా థియేట‌ర్ల‌లోకి విడుదల కానుంది..ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశారు.తాను చిన్నప్పటి నుంచి ఎంతో చలాకీగా ఉండేదాన్ని. 13 ఏళ్ల వయసులో మొదటిసారి రంగస్థలంపై నటించినట్లు ఆమె తెలిపారు...ఆ ప్రదర్శన పూర్తయ్యాక అందరూ ప్రశంసలతో ముంచెత్తడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించేదని ఆ సంఘటన నాపై చాలా ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.

తన 15 ఏళ్లకే థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయినట్లు అలాగే లండన్‌ వెళ్లి ‘రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌’ నుంచి డిగ్రీ కూడా పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.లండన్ నుంచి తిరిగి బెంగళూరు రాగానే ‘బీర్బల్‌’ (కన్నడ) సినిమాలో అవకాశం వచ్చిందని  ఆ సినిమాతో తన వెండితెర ప్రయాణం మొదలైనట్లు ఆమె తెలిపింది..నటి రుక్మిణి తన ఫ్యామిలీ విషయాలు కూడా తెలియజేశారు..ఆమె పుట్టింది బెంగుళూరులోనే అయినా కూడా తన తండ్రి వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పెరిగినట్లుగా ఆమె తెలిపారు...అమ్మ నృత్యకారిణి.. నాన్న కల్నల్‌ కావడంతో తనకి పదేళ్లు ఉన్నప్పుడే భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో జరిగిన ఉగ్రదాడిలో రుక్మిణి నాన్న వీరమరణం పొందారు. ఆయనకు మరణానంతరం ‘అశోక చక్ర’ కూడా లభించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి  కూడా ఆయనే కావడం విశేషం. తండ్రి దూరమైనా నాటి నుంచి తల్లే తన సర్వసం రుక్మిణి చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: