మళ్ళీ అదే తప్పు చేసిన అల్లు అర్జున్..ఏమైంది బ్రో నీకు..ఫ్యాన్స్ హర్ట్..!

Thota Jaya Madhuri
ప్రజెంట్ హీరోలు తమ మనసును మార్చుకుంటున్నారు. ఎంతసేపు రొమాంటిక్ లవ్ సినిమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలను కూడా ఎక్కువగా చూస్ చూసుకుంటున్నారు. ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య . ఈ హీరో గురించి చెప్పగానే అందరికీ గజినీ సినిమానే గుర్తొస్తుంది . అందులో సంజయ్ రామస్వామిగా ఎంత రొమాంటిక్ లుక్స్ లో కనిపించాడొ మనకు తెలుసు . అమ్మాయిలు ఓ రేంజ్ లో సూర్య లుక్సని ఎంజాయ్ చేశారు . అంతేకాదు సూర్య ని అమ్మాయిలు ప్రేమించడం మొదలుపెట్టింది ఈ సినిమాతోనే. అంతకు ముందు లవ్ స్టోరీ సినిమాల్లో చాలా నటించాడు సూర్య కానీ సూర్యకి బ్రేక్ ఇచ్చింది మాత్రం గజినీ అని చెప్పాలి.


కాగా అటువంటి సూర్య ఇప్పుడు చాలా చాలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ని చూస్ చేసుకుంటున్నాడు . సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా "కంగువ". సుమారు మూడేళ్లుగా ఈ సినిమా కోసం సూర్య ఎంతో కష్టపడ్డాడు . భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్స్ . పాన్ ఇండియా లెవెల్ లో కొంగువ చిత్రం తెరకెక్కింది . నవంబర్ 14 వ తారీకున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. ఈ సినిమా  ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు సూర్య . కంగువ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు షోస్ కి కూడా అటెండ్ అవుతూ వచ్చాడు.


అంతేకాదు సూర్య బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేశాడు.  ఇదే క్రమంలో కంగువ సినిమాను డైరెక్టర్ ముందు తెలుగు హీరోతో చేయాలి అని భావించాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కంగువా డైరెక్టర్ శివ ఈ సినిమాని మొదటగా పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట,  ఆయన ఇంటికి వెళ్లి కథ కూడా వివరించారట . అంతేకాదు ఆ హీరోకి కూడా కథ బాగా నచ్చిందట .కానీ అల్లు అర్జున్ అదే సమయానికి చాలా కాల్ షీట్స్ ఫీల్ చేసేసుకోవడంతో శివ ఎక్కువ టైం వెయిట్ చేయను అనడంతో ఈ సినిమా సూర్య ఖాతాలోకి పడింది . దీంతో మంచి సినిమా మిస్ చేసుకున్నాడు బన్నీ. ఏదోలా కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేసి ఇచ్చుటే..కంగువా సినిమా బన్నీ చేసుంటే 2000 కోట్లు కచ్చితంగా కలెక్ట్ చేసేది. గతంలో మంచి హిట్ సినిమాలను ఇలానే బన్నీ మిస్ చేసుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: