మహేష్ ఒకడు సినిమా నుంచి నమ్రతాను తప్పించడానికి అసలు కారణం ఇదే..!

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ నట వరుసటిగా సినిమాలో అడుగుపెట్టిన మహేష్ ... ఆయన కెరియర్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన  ఒక్కడు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకు సాధ్యం కానీ రీతిలో రికార్డులు అయితే క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట మహేష్ భార్య  నమ్రతను తీసుకోవాలని అనుకున్నారట .

ఎందుకంటే వీరి కాంబో లో అంతకు ముందు వచ్చిన వంశీ మూవీ ప్లాఫ్ అయింది. దీంతో వాళ్ళది ప్లాప్ కాంబినేషన్ గా పేరు వచ్చింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి సక్సెస్ఫుల్ కాంబో గా నిలవాలని ఉద్దేశంతో మహేష్ బాబు నమ్రతను హీరోయిన్గా తీసుకుందామని డైరెక్టర్ గుణశేఖర్ తో చెప్పారట. అయితే అప్పటికి ఈ విషయం తెలుసుకున్న కృష్ణ ఈ సినిమా స్టోరీ బాగుంది. ఈ సినిమాలో నమ్రతను తీసుకుంటే ఇప్పటికే వీది ప్లాఫ్ కాంబినేషన్ కావడంతో మీరు చేసే ఈ సినిమా మీద‌ పెద్దగా బజ్‌ క్రియేట్ అవ్వదు అని చెప్పారట .

ఇక అప్పటికే ఖుషి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన భూమిక ను ఇందులో హీరోయిన్గా తీసుకోండని సలహా ఇచ్చారట. ఇక‌ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కృష్ణ, గుణశేఖర్ కు భరోసా ఇచ్చారట. అలా మహేష్‌కు చెప్పి ఈ సినిమా నుంచినమ్రతను తప్పించి భూమిక ను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ విషయం పై మహేష్ బాబు కొద్ది రోజుల పాటు కృష్ణ పై కాస్త కోపంగానే ఉన్నాడట. ఆ తరువాత మహేష్ బాబు కి కూడా ఆస‌లు విష‌యం తెలుసుకుని.. ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మార్కెట్ అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాడట. హిట్ కాంబినేషన్ అయితే సినిమాకి ప్లస్ అవుతుందని తెలుసుకొని తండ్రి కృష్ణ పై తన అభిప్రాయాన్ని మార్చుకొని.. ప్రతి సినిమా విషయంలో ఆయన సలహా తీసుకుంటే సినిమాలు చేసుకుంటూ వచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: