'కిల్' సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ నటిస్తుందా .... ఫ్యాన్స్ కి పంగగే?

Anilkumar
త్రిష కృష్ణన్ అనే పేరు తెలుగు సినిమా ప్రేమికులకు ఎంతో సుపరిచితం. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ అందాల నటి  తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. 1983 మే 4న తమిళనాడులోని మద్రాస్ లో జన్మించిన త్రిష తన చిన్ననాటి నుంచే అందం, నటన పై మక్కువ కనబరిచింది. 1999లో మిస్ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచి సినీ రంగంలో అడుగుపెట్టింది. త్రిష తన తెలుగు సినీ ప్రయాణాన్ని "నీ మనసు నాకు తెలుసు" సినిమాతో ప్రారంభించింది. ఇక తాను నటించిన మొట్టమొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తన నటనలు మరోసారి నిరూపించుకోవాలని వర్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటాను,అతడు,అర్జున్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, 'నువ్వు నేను' వంటి సినిమాలతో హిట్టు ఫ్లాపు తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే త్రిష అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు రోజు రోజుకి తన అందం పెరుగుతూ వస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే త్రిష మరింత వేగంగా సినిమాలు చేస్తూ ఇది వరకు ఎప్పుడు లేనంత రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. తాజాగా త్రిష, చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఈయడానికి సిద్ధంగా ఉంది. హిందీలో కిల్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగు,తమిళ భాషలలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇక ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా లారెన్స్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ గా త్రిష ని ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందమంతా త్రిషతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదిలా ఉంటే తెలుగు తమిళ భాషలలోనూ ఈ సినిమాకి కిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గా తెలుస్తోంది. రేపు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి ఒకవేళ త్రిష  హిరోయిన్ గా ఫిక్స్ అయితే ఈ ప్రాజెక్టు పై మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ విషయాలన్నిటి పై రేపు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. లారెన్స్ తాజాగా హీరోగా నటిస్తున్న బెంజ్ అనే తమిళ సినిమా నుంచి కూడా రేపు ఓ మంచి క్రేజ్ అప్డేట్ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: