బాలీవుడ్ లో స్టార్ నటుడు అయినటువంటి శత్రుజ్ఞ సిన్హ కూతురు సోనాక్షి సిన్హా అంటే తెలియని వారు ఉండరు. తండ్రి నట వారసత్వాన్ని అంది పుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ టాలెంటుతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతోంది. అలాంటి సోనాక్షి సిన్హా ఈ ఏడాది జూన్ 23వ తేదీన తన ప్రియుడైనటువంటి నటుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరి పెళ్లి అయితే దగ్గరి సన్నిహితుల సమక్షంలో ముంబైలో ఏర్పాటు చేశారు. పెళ్లి చేసుకొని నాలుగు నెలలు గడిచిన ఈ జంట ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తూ వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఇక పెళ్ళైనప్పటి నుండి వరుసగా విదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు..
ప్రస్తుతం ఆమె కమిట్ అయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి తన భర్తతో స్పెషల్ గా గడిపేందుకే ప్రాధాన్యతని ఇస్తుందని తెలుస్తోంది. అయితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కలిసి 2002లో డబుల్ ఎక్స్ అనే మూవీలో కలిసి నటించారు. ఇక కలిసి నటించిన టైంలోనే వీరిద్దరి మధ్య పుట్టిన ప్రేమ మెల్లిమెల్లిగా పెళ్లి వరకు దారి తీసింది. ఇందులో సోనాక్షి సిన్హా హిందూ జహీర్ ఇక్బాల్ ముస్లిం అబ్బాయి కావడంతో ఈ పెళ్లికి చాలామంది కాస్త విముఖత చూపించినా అవేవీ పట్టించుకోకుండా వారి లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
అయితే వీరి పెళ్ళై 4 నెలలు కూడా గడవకముందే సోనాక్షి సిన్హా గర్భవతి అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె ముంబై లో దివాళీ బాష్ లో అనార్కలి సూట్ ధరించింది. ఈ క్రమంలో కాస్త బొద్దుగా కనిపించడంతో సోనాక్షి సిన్హా గర్భవతి అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు సోనాక్షి సిన్హా పొట్ట కాస్త ఎత్తుగా ఉండడంతో బేబీ బంప్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తలపై వారు ప్రత్యక్షంగా స్పందించి చెప్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.